పాజిటివ్‌ రాకున్నా, లక్షణాలుంటే ఆసుపత్రుల్లో చేర్చాల్సిందే!

27 Apr, 2021 08:42 IST|Sakshi

ఆప్‌ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు సూచన  

సాక్షి, న్యూఢిల్లీ: పాజిటివ్‌ రిపోర్టు రాకున్నా కోవిడ్‌ లక్షణాలుంటే ఆసుపత్రుల్లో చేర్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఆప్‌ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు సూచించింది. ప్రభుత్వ ఆదేశాలను ఆసుపత్రులు తూచ తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీఎన్‌ పాటిల్‌ , జస్టిస్‌ జస్మీత్‌ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. మినిమిం ఆక్సిజన్‌ లెవెల్‌ కన్నా తక్కువ ఉన్న రోగులకు లబ్ధి చేకూరేలా తగిన చర్యలు తీసుకోని, ఆ ఆదేశాలు అందరికీ చేరేలా చూడాలని స్పష్టం చేసింది.

కాగా ఏప్రిల్‌ 23 నుంచే ఈ ఆదేశాలు అమలులో ఉన్నాయని ఢిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది అనూజ్‌ అగర్వాల్‌ కోర్టుకు తెలిపారు. ఇతరత్రా ఆదేశాలు జారీ అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. కోవిడ్‌–19 పరీక్షలు దేశరాజధానిలో నిర్వహించడం లేదని కేంద్రం తరఫు హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చేతన్‌శర్మ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేసులు తక్కువగా ఉన్న సమయంలో ఎక్కువ పరీక్షలు చేశారని, ఎక్కువ కేసులు ఉన్నప్పుడు తక్కువ పరీక్షలు చేస్తున్నారని వివరించారు. కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాలు మరిన్ని పెంచాలని, మౌలికసదుపాయాలు పెంచాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ధర్మాసనం కోరింది. 

చదవండి: అలాంటి వారిని ఉరి తీస్తాం: హైకోర్టు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు