నచ్చకపోతే వాట్సాప్‌ను తొలగించండి

18 Jan, 2021 16:13 IST|Sakshi

న్యూఢిల్లీ: వాట్సాప్ ప్రైవసీ పాలసీ నిబంధనలపై కొద్దీ రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైన సంగతి మనకు తెలిసిందే. నేడు హైకోర్టు వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ విధానంపై వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు నోటీసు ఇవ్వడానికి నిరాకరించింది. వాదనల సందర్భంగా హైకోర్టు వాట్సాప్ ఒక ప్రైవేట్ యాప్ అని ప్రజలు దీనిని ఉపయోగించకుండా ఉండటానికి స్వేచ్ఛ ఉందని కోర్టు తెలిపింది.(చదవండి: హైక్ మెసెంజర్ సేవలు నిలిపివేత)

విచారణ ప్రారంభంలోనే జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా పిటిషనర్‌తో మాట్లాడుతూ.. వాట్సాప్ ఓ ప్రైవేట్ యాప్ అని యూజర్లకు ఇష్టమైతే వాడుకోవచ్చునని లేదా తీసేయొచ్చునని స్పష్టం చేసారు. మ్యాప్స్, బ్రౌజర్‌ వంటి ఇతర యాప్స్ కూడా ఇలాంటి ప్రైవసీ విధానాలను తీసుకొచ్చాయి అని కోర్టు అభిప్రాయపడింది. పిటిషనర్ ఒక వాట్సాప్ యాప్ నే ఒక్క వాట్సాప్‌‌నే నిందించడం సరికాదని సూచించింది. వినియోగదారులు ఇతర యాప్స్ యొక్క నిబంధనలు, షరతులను చదివితే వాట్సాప్ తరహా నిబంధనలే కనిపిస్తాయని పేర్కొంది. అనంతరం ఈ విచారణను జనవరి 25కు కోర్టు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు