లేడీ శ్రీరాం కాలేజీలో ఫీజుల తగ్గింపు

22 Nov, 2020 08:39 IST|Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో చదువుతోన్న తెలంగాణ విద్యార్థిని ఆర్థిక సమస్యలతో చదువుని కొనసాగించలేక, ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అనంతరం విద్యార్థి సంఘాల ఆందోళనల నేపథ్యంలో లేడీ శ్రీరాం కళాశాల కొన్ని కోర్సులకు ఫీజును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ల్యాప్‌టాప్‌లను అందించేందుకు ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసింది. రెండో సంవత్సరం విద్యార్థులను హాస్టళ్ళలో ఉండేందుకు అనుమతిస్తున్నట్లు కళాశాల పేర్కొంది. కాలేజీలు మూసివేయడంతో విద్యార్థులు కళాశాల సౌకర్యాలను వినియోగించుకోలేకపోతుండడంతో ఈ యేడాది ఫీజులో ఆ చార్జీలను తగ్గిస్తూ కాలేజీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. (ఐఏఎస్‌ కావాలన్న ఆశలు ఆవిరి..)

దీంతో ఫీజు గణనీయంగా తగ్గనుంది. అలాగే మిగిలిన పీజు సైతం వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశాన్ని సైతం కళాశాల కల్పించింది.  కోవిడ్‌ తగ్గిన తరువాత అవసరాన్ని బట్టి రెండు, మూడో యేడాది విద్యార్థులకు మరింత మందికి హాస్టల్‌ వసతి కల్పించే విషయాన్ని పరిశీలిస్తామని  అధికారులు తెలిపారు.  విద్యార్థుల హాస్టల్‌ సౌకర్యం పొడిగింపుని నిరోధించే కొన్ని వాక్యాలను సైతం  దరఖాస్తు ఫారం నుంచి తొలగిస్తున్నట్లు కళాశాల అధికారులు పేర్కొన్నారు. (చదువుల తల్లి బలవన్మరణం)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా