కరోనా విజృంభణ: ఏప్రిల్‌ 30వరకు ఆంక్షలు

29 Mar, 2021 03:57 IST|Sakshi

అతిథులు 200 దాటొద్దు 

ఢిల్లీలో మరోసారి కరోనా ఆంక్షలు

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కేసులు పెరుగుతన్న నేపథ్యంలో దేశరాజధానిలో ఆంక్షలు మళ్లీ ప్రారంభమయ్యాయి. గతంలో పెళ్లిళ్లు, వేడుకలు, అంత్యక్రియలకు హాజరయ్యే సంఖ్యను కుదిస్తూ ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ తాజాగా ఆదేశాలిచ్చింది. పెళ్లిళ్లు, వేడుకలకు అతిథులు 200 మంది దాటకూడదని ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (డీడీఎంఏ) ఆదేశాలు జారీ చేసింది.

పెళ్లిళ్లకు 200 మంది అతిథులు, ఓపెన్‌ ఎయిర్‌ వెన్యూల్లో జరిగే కార్యక్రమలకు 100 మందికి, అంత్యక్రియల కార్యక్రమాలకు 50 మంది మించరాదని స్పష్టం చేసింది. కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు పాటించడంతోపాటు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొంది. ఈ ఆదేశాలు ఏప్రిల్‌ 30 వరకు అమలులో ఉంటాయని తెలిపింది. శనివారం 1,558 కేసులు రావడం మొత్తం కేసులు 6,55,834కు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 

>
మరిన్ని వార్తలు