Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.. తొలి చార్జిషీట్‌ దాఖలు

25 Nov, 2022 13:53 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో సీబీఐ తొలి చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఆప్‌నేత విజయ్‌ నాయర్‌, అభిషేక్‌ బోయిన్‌పల్లితో సహా ఏడుగురు నిందితులపై అభియోగాలు మోపుతూ రోస్‌ అవెన్యూ కోర్టులో చార్జిషీట్‌ ఫైల్‌ చేసింది. దాదాపు 10 వేల పేజీలతో సీబీఐ చార్జ్‌ షీట్‌ రూపొందించింది. చార్జిషీట్‌లో ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఉండగా.. అయిదుగురు ప్రైవేటు వ్యక్తులు ఉన్నారు. అయితే సీబీఐ తొలి ఛార్జిషీట్‌లో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేరు లేదు.

చార్జిషీట్‌లో విజయ్‌ నాయర్‌, అభిషేక్‌, సమీర్‌ మహేంద్రు, అరుణ్‌ రామచంద్ర పిల్లై, ముత్తా గైతమ్‌, కుల్‌దీప్‌ సింగ్‌, నరేందర్‌ సింగ్‌ పేర్లు చేర్చింది. కుల్‌దీప్‌ సింగ్‌, నరేందర్‌ సింగ్‌ ఇద్దరు ప్రభుత్వ అధికారులు. ఇంకా అయిదుగురిని అరెస్ట్ చేయలేదని సీబీఐ తెలిపింది. ప్రభుత్వ అధికారులను ప్రాసిక్యూషన్‌ చేసేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకుంది సీబీఐ. కేసు దర్యాప్తు కొనసాగుతుందని కోర్టుకు తెలిపింది. తదుపరి విచారణ నవంబర్‌ 30కి వాయిదా వేసింది.

►A1 ఎక్సైజ్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ నరేంద్ర సింగ్‌
►A2 ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ కుల్‌దీప్‌ సింగ్‌
►A3  విజయ్‌ నాయర్‌
►A4 అభిషేక్‌ బోయిన్‌పల్లి
►A5 సమీర్‌ మహేంద్రు,
►A6 అరుణ్‌ రామచంద్ర పిళ్లై,
►A7గా ముత్తా గౌతమ్‌ పేర్లను చార్జ్ షీట్‌లో పేర్కొంది.

ఇప్పటికే లిక్కర్‌ స్కాం కేసులో నిందితుడైన అభిషేక్ బోయినపల్లికి సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగుతున్నందున రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్టు  కోర్టు పేర్కొంది. అదే విధంగా  మరో నిందితుడు, ఆప్‌ నేత విజయ్‌ నాయర్‌ను రెండు రోజుల ఈడీ కస్టడీకి అనుమతిచ్చింది.
చదవండి: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు..

మరిన్ని వార్తలు