ముగిసిన పిళ్లై, కవితల ఈడీ ఉమ్మడి విచారణ

20 Mar, 2023 16:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లిక్కర్‌ స్కాంలో నిందితుడు, హైదరాబాదీ వ్యాపారవేత్త అరుణ్‌ రామచంద్ర పిళ్లైని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిపి విచారించింది ఇవాళ(సోమవారం మార్చి 20) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. 

పిళ్లై రిమాండ్‌ రిపోర్ట్‌లో కవితకు బినామీ అని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగు గంటలపాటుగా వీళ్లిద్దిరినీ ఎదురుదెరుగా కూర్చోబెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు ఈడీ అధికారులు. సౌత్‌ గ్రూప్‌తో సంబంధాలపై ముఖాముఖిగా వీళ్లను ప్రశ్నించినట్లు సమాచారం.  సుమారు నాలుగు గంటలపాలు వీళ్లను ప్రశ్నించి.. అనంతరం పిళ్లైను కస్టడీ ముగియడంతో ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూ కోర్టుకు తరలించారు. 

ఢిల్లీ స్పెషల్‌  కోర్టు పిళ్లైకి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. అనంతరం పిళ్లైని తీహార్‌ జైలుకు తరలించారు. మరోవైపు కవితకు ఈడీ అధికారలు విడిగా విచారిస్తున్నారు.

ఇదీ చదవండి: రేవంత్‌ సంచలన ఆరోపణలు.. సిట్‌ నోటీసులు 

మరిన్ని వార్తలు