ఆమె మరణించిన 15 ఏళ్లకు కీలక తీర్పు ఇచ్చిన కోర్టు

20 Jan, 2023 16:00 IST|Sakshi

పెళ్లైన ఏడాదిన్నరకే వరకట్న దాహానికి బలైంది. ఎన్నో ఏళ్లుగా కోర్టులో విచారణ సాగిని ఈ కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఎట్టకేలకు 15 ఏళ్లకు ఈ కేసుకు సంబంధించిన వ్యక్తులను దోషులుగా నిర్ధారించింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..భారతి అనే మహిళ అక్టోబర్‌3, 2007న పెళ్లై ఏడాదిన్నరలోపే అసాధారణ పరిస్థితుల్లో చనిపోయింది. దీంతో ఆమె భర్త, అత్త, బావ, మరిదిపై  వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఐతే ఆమెను హత్య చేశారనే సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిందితులను తొలుత నిర్దోషులుగా ప్రకటించారు.

పోస్ట్‌మార్టం నివేదికలో మాత్రం ఆమె ఊపిరాడక చనిపోయినట్లు ఉంది. అదీగాక దర్యాప్తు అధికారులు సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న వ్యక్తులు గురించి, పైగా పక్కన అద్దెకుంటున్న వారిని విచారించడం వంటివి చేయలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఈ కేసును విచారిస్తున్న కోర్టు ప్రాసిక్యూషన్‌ వాదనలు విన్న కోర్టు ఎట్టకేలకు దోషలుగా నిర్ధారిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. బాధితురాలు వివాహం అయినప్పటి నుంచి వరకట్న సమస్యలు ఎదుర్కొన్నట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొంది.  

మరణానికి ముందు రోజు కూడా వేధింపులకు గురైనట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపింది. అలాగే ఆమె మరణానికి ముందు నిందితులందరిపై ఆరోపణలు చేస్తూ రాసిన లేఖ తదితర సాక్ష్యాధారాలు ఆధారంగా భర్త పవన్‌కుమార్‌, అత్తగారు సత్‌బిరో, బావ కప్తాన్‌ సింగ్‌, బావమరిది దల్జీత్‌ సింగ్‌లను దోషులగా నిర్ధారించినట్లు కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే మృతురాలు వివాహం అయినప్పటి నుంచి చనిపోయేంత వరకు వేధింపులు కొనసాగినట్లు తగిన సాక్ష్యాధారాలు ఉన్నందున వారిని దోషులగా గర్తించినట్లు స్పష్టం చేసింది. ఈ కేసుకి సంబంధించి తదుపరి తీర్పును జనవరి 30కి వాయిదా వేసింది.  

(చదవండి: అనాథలమని ఆవేదన చెంది.. ముగ్గురు అక్కచెల్లెళ్ల ఆత్మహత్య..)

మరిన్ని వార్తలు