జొమాటో డెలివరీ బాయ్‌కు బొట్టుపెట్టి, హారతిచ్చి స్వాగతం.. ఎందుకో తెలుసా?

8 Oct, 2022 16:05 IST|Sakshi

ప్రస్తుత జనరేషన్‌లో దాదాపుగా అందరూ ఫుడ్‌ హోమ్‌ డెలివరీనే ప్రిఫర్‌ చేస్తున్న విషయం తెలిసిందే. పండుగ రోజు, ఇంట్లో ఏదైనా స్పెషల్‌ డే అయితే.. కచ్చితంగా రెస్టారెంట్‌ నుంచి ఫుడ్‌ డెలివరీ ఆర్డర్‌ చేయాల్సిందే అన్నట్టుగా మారిపోయింది. ఇంట్లో దర్జాగా కూర్చుని.. చేతిలో స్మార్ట్‌ఫోన్‌ పట్టుకుని ఒక్క క్లిక్‌తో ఆర్డర్‌ పెట్టేస్తారు. ఈ క్రమంలో వారు పెట్టిన ఆర్డర్‌ కొంచెం లేట్‌గా వస్తే.. డెలివరీ బాయ్‌కు చుక్కలు చూపిస్తారు. కాగా, తాజాగా ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ను తెచ్చిన డెలివరీ బాయ్‌కు ఓ కస్టమర్‌.. వినూత్న రీతిలో స్వాగతం పలికాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు  కామెంట్స్‌ చేస్తున్నారు.

వివరాల ప్రకారం.. దేశరాజధాని ఢిల్లీలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ కస్టమర్‌ జొమాటోలో ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టుకున్నాడు. కాగా, ఆ కస్టమర్‌ ఆర్డర్‌ తీసుకుని సదరు జొమాటో డెలివరీ బాయ్‌.. ఓ గంట ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాడు. అటు వర్షం.. ఇటు పండుగ కావడంతో ట్రాఫిక్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటూ జొమాటో డెలివరీ బాయ్‌ ఎట్టకేలకు ఫుడ్‌ను డెలివరీ అందించాడు. 

అయితే, ఫుడ్‌ను డెలివరీ ఇస్తున్న సమయంలో సదరు కస్టమర్‌.. వినూత్నంగా స్వాగతం పలికాడు. ఫుడ్‌ డెలివరీ బాయ్‌ కుమార్‌.. గుమ్మం ముందుకు వచ్చిన వెంటనే కస్టమర్‌.. డెలివరీ బాయ్‌కు బొట్టుపెట్టి.. హారతి ఇచ్చి స్వాగతం పలికాడు. దీంతో, సదరు డెలివరీ బాయ్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. నవ్వుతూ అలాగే నిలబడిపోయాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో​ చక్కర్లు కొడుతోంది. డెలివరీ బాయ్‌లు కూడా మనుషులే అని అర్థం చేసుకునే వాళ్లు ఇలాగే స్పందిస్తారు అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

A post shared by Sanjeev Tyagi (@sanjeevkumar220268)

మరిన్ని వార్తలు