15 రోజుల పాటు శిక్ష..ఆప్‌ మంత్రికి మరో ఎదురు దెబ్బ.

25 Dec, 2022 16:07 IST|Sakshi

మనీలాండరింగ్ కేసులో విచారణ కోసం ఎదురుచూస్తున్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కి మరో ఎదురుదెబ్బ తగిలింది. కనీసం సందర్శకులు ఆయన్ను కలుసుకునేందుకు లేకుండా 15 రోజుల పాటు శిక్ష విధించింది. అలాగే అతనికి సెల్‌, టేబుల్‌, కుర్చి వంటి అన్ని సౌకర్యాలను తొలగించింది. ఈ మేరకు బీజేపీ నేతృత్వలోని ప్రభుత్వ ప్రతినిధి డిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల నేపథ్యంలోనే సత్యేందర్‌పై ఈ చర్యలు తీసుకున్నారు.

అలాగే అప్పటి జైలు అధికారి సందీప్‌ గోయోల్‌ కారణంగానే సత్యేందర్‌ జైల్లో రాజభోగాలు అనుభవించారంటూ విమర్శలుల రావడంతో గోయెల్‌పై కూడా కమిటీ శాఖాపరమైన చర్యలను తీసుకున్నట్లు పేర్కొంది. అదీకూడ ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌ బీజేపీని ఓడించిన వారాల తర్వాత జైన్‌పై ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం.

వాస్తవానికి అవినీతి ఆరోపణలు ఎదర్కొంటూ తిహార్‌ జైలులో ఉన్నసత్యేందర్‌ జైన్‌ జూన్‌ నుంచి జైలులోనే ఉన్నారు. ఆయన  వరుస సీసీటీవీ వీడియో లీక్‌లతో వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. జైల్లో ఆయనకు విఐపీ ట్రీట్‌మెంట్‌, పసందైన విందు అంటూ బీజేపీ వరుస వీడియోలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జైలు అధికారులను సస్పెండ్‌ చేశారు కూడా. ఆఖరికి ఆయన బెయిల్‌ తిరస్కరణకు గురవ్వడం తోపాటు మత విశ్వాసాలకు తగ్గట్టుగా ఆహారం తీసుకునేలా అనుమతించమంటూ చేసుకన్న అభ్యర్థన సైతం కోర్టు తిరస్కరించింది.

 (చదవండి: నా కుమారుడిని రక్షించుకోలేకపోయా!: కేంద్ర మంత్రి భావోద్వేగం)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు