Delhi MCD Exit Poll 2022: టాప్‌లో ఆప్‌.. బీజేపీ మెరుగైన ప్రదర్శన.. మరి కాంగ్రెస్‌?

5 Dec, 2022 20:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఎంసీడీ)కు ఆదివారం జరిగిన ఎన్నికల్లో 50 శాతం పోలింగ్‌ నమోదైంది. ఓట్ల లెక్కింపు 7న జరగనుంది. 1,349 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం ఓటర్లు 1.45 కోట్ల మంది. 2017 ఎన్నికల్లో 53% పోలింగ్‌ నమోదైంది. ఈక్రమంలో గెలుపు తమదంటే తమదేనని ఆప్, బీజేపీ అంటున్నాయి. అయితే, ఎంసీడీ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు మాత్రం ఆమ్‌ ఆద్మీ పార్టీకే మొగ్గు చూపాయి. బీజేపీ రెండు, కాంగ్రెస్‌ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాయి. 

మరోవైపు గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు చేదు ఫలితాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. సోమవారం సాయంత్రం వెల్లడైన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో రెండు రాష్ట్రాల్లోనూ ఆప్‌ మూడో స్థానానికే పరిమితమైంది. గుజరాత్‌లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యత కనబర్చగా.. హిమాచల్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.
(చదవండి: ప్రధాని రాష్ట్రంలో విరబూసిన కమలం, ఆప్‌ పరిస్థితేంటి?)

మున్సిపల్‌  ఎన్నికల్లో  ప్రజలు ఆప్‌కే మొగ్గు చూపుతున్నట్లు ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడిస్తున్నాయి. ఎగ్జిట్‌పోల్‌ సర్వే ప్రకారం..
ఆక్సిస్‌ మై ఇండియా
ఆప్‌: 149-171
బీజేపీ 69-91
కాంగ్రెస్‌ 3-7

టైమ్స్‌ నౌ​-ఈటీజీ
ఆప్‌: 146-156
బీజేపీ: 84-94
కాంగ్రెస్: 6-10

న్యూస్‌ ఎక్స్‌-జన్‌కి బాత్‌:
బీజేపీ: 70-92
ఆప్‌: 159-175
కాంగ్రెస్‌: 3-7
(చదవండి: హిమాచల్‌లో పుంజుకున్న కాంగ్రెస్‌.. రెండో స్థానంలో ఎవరంటే!
)

మరిన్ని వార్తలు