Delhi: ఎలక్ట్రిక్‌ వాహనాల పార్కింగ్‌లో అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన వాహనాలు, ఫొటోలు వైరల్‌

8 Jun, 2022 13:06 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జామియా నగర్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల పార్కింగ్‌ స్టేషన్‌ వద్ద బుధవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కార్లు, ద్విచక్ర వాహనాలతో సహా దాదాపు వందలాది వెహికిల్స్‌ అగ్నికి ఆహుతయ్యాయి. మంటల్లో కాలిబూడిదైన వాటిలో ఈవీ వాహనాలు కూడా ఉన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అందుపులోకి తెచ్చారు.

మంటల్లో పది కార్లు, రెండు బైక్‌లు, రెండు స్కూటీలు, 30 ఈ- రిక్షాలు, 50 పాత ఈ-రిక్షాలు తగలబడినట్లు ఢిల్లీ ఫైర్‌ అధికారులు తెలిపారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో పార్కింగ్‌ మేనేజర్‌ అక్కడే ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
చదవండి: సిద్దిపేట జిల్లాలో ఘోరం.. ఎలక్ట్రిక్‌ వాహనం పేలి ఇల్లు దగ్దం

ఇక భారత్‌లో ఇటీవల ఎలక్ట్రిక్‌ వాహనాల పేలుళ్లు అధికమయ్యాయి. ఈవీ ప్రమాదాల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. మొన్నటికి మొన్న నాసిక్‌లోని రవాణా కంటైనర్‌లో జితేంద్ర ఎలక్ట్రిక్ వాహనాలకు చెందిన నలభై ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటల్లో  కాలి బూడిదయ్యాయి. కాగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో మార్చి నుంచి ఏప్రిల్‌ మధ్య ఎనిమిది ఈవీ ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మరిన్ని వార్తలు