కరోనా: మరణాల్లో మహాను దాటిన ఢిల్లీ

16 Nov, 2020 20:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్‌ కల్లోలం దేశ రాజధానిలో కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకూ అత్యధిక మరణాలు చోటు చేసుకుంటున్న మహారాష్ట్రను దాటినట్లు సోమవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాలు చూస్తే తెలుస్తోంది. ఈ ఒక్కరోజే (సోమవారం) ఢిల్లీలో 95 మరణాలు సంభవించాయి. కేసులలో మరణాల శాతం 21.84 గా నమోదయింది. దేశంలో కరోనా వ్యాప్తి,​ కోలుకోవడం(7,606)లో సైతం రాజధాని రెండో స్థానంలో నిలిచింది. కేసులు అదుపులోనికి రావడానికి ప్రధాన కారణం టెస్టులు చేసి పాజిటివ్‌లను గుర్తించడంగా వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఢిల్లీలో కరోనా నియంత్రణ బాధ్యతలను కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా చేపట్టడంతో ఇది సాధ్యమవుతున్నట్లు తెలుస్తోంది. దేశ రాజధానిలో కోలుకున్నవారు  93.23 శాతంకు పెరిగారు. సోమవారం నాటి నివేదికల ప్రకారం రాష్ర్గ  కేంద్ర పాలిత ప్రాంతాల్లో గడచిన 24 గంటల్లో ఢిల్లీ తరువాత కేరళలో 6,684 ,బెంగాల్‌లో 4,480 కోవిడ్‌ బాధితులు కోలుకున్నారు. అయితే ఈ మూడు ప్రాంతాలలో 76.63 శాతం కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ తరువాత బెంగాల్‌, కేరళలో కేసుల  నమోదులో మూడో స్థానంలో ఉన్నాయి. మొత్తం మరణాలో ఢిల్లీ ఐదో స్థానంలో ఉంది. ఢిల్లీ తరువాత వరుసగా అత్యధిక మరణాలు మహారాష్ట్ర 60,పశ్చిమ బెంగాల్‌ 51,పంజాబ్‌ 30,కేరళ కర్ణాటక లో చెరో 21,ఉత్తర్‌ ప్రదేశ్‌ 18,ఒడిషాలో 17 నమోదు అయ్యాయి. దేశంలోని మరణాల్లో 79 శాతం ఈ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి.

కేంద్ర గణాంకాల ప్రకారం కరోనా మహహ్మారి నుంచి రోజు రోజుకి కోలుకునేవారి సంఖ్యలో భారత్‌ కొత్త రికార్డులు తిరగరాస్తునే ఉంది. వరుసగా 43వ రోజుకోలుకున్న వారి సంఖ్య 43,851కు పెరగగా, గడచిన 24 గంటల్లో కొత్త కేసులు  30,548 పరిమితమయ్యాయి. పాజిటివ్‌, నెగటివ్‌ల తేడా  ఏకంగా 13,303గా ఉంది. దేశంలోప్రస్తుతం కరోనా యాక్టీవ్‌ కేసుల సంఖ్య 4,65,478 ఉన్నాయి.దేశంలో ఇప్పటి వరకు 82,49,579 (78.59 శాతం) మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 76% శాతం వరకూ మహారాష్ట్ర, రాజస్తాన్, హర్యానా, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్‌, గుజరాత్ లలో ఉన్నాయి.  

మరిన్ని వార్తలు