‘టూల్‌కిట్‌’ కేసులో ట్విట్టర్‌ యాజమాన్యానికి నోటీసు

25 May, 2021 09:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద కోవిడ్‌ టూల్‌కిట్‌ కేసులో ఢిల్లీ పోలీసు స్పెషల్‌ సెల్‌ ట్విట్టర్‌ యాజమాన్యానికి సోమవారం నోటీసు జారీ చేసింది. టూల్‌కిట్‌ వ్యవహారంపై అందించిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే రెండు పోలీసు బృందాలు ఢిల్లీలోని లాడోసరాయ్‌లో ఉన్న ట్విట్టర్‌ ఇండియా కార్యాలయానికి చేరుకున్నాయి.

అక్కడున్న సిబ్బందికి నోటీసు అందజేశాయి. దేశ ప్రతిష్టను, ప్రధానిమోదీ ప్రతిష్టను దెబ్బతీయడానికి కాంగ్రెస్‌ కుట్రపన్నుతోందని బీజేపీ ఆరోపించింది. తప్పుడు ప్రచారం చేయడానికి టూల్‌కిట్‌ను సృష్టించిందని విమర్శించింది. తప్పుడు ప్రచారం కోసం ట్విట్టర్‌ను సైతం కాంగ్రెస్‌ వాడుకుంటోందని బీజేపీ చెబుతోంది.

(చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్‌ చేస్తున్న 76 ఏళ్ల బామ్మ)

మరిన్ని వార్తలు