రహదారులే ఏరులైన వేళ.. ఎల్లో అలర్ట్‌ జారీ

24 Sep, 2022 12:15 IST|Sakshi

న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా వరసగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులన్ని జలమయమయ్యాయి. ఈ మేరకు వరద తాకిడికి నేలకూలిన చెట్లు, పాడైన రహదారుల జాబితాను విడుదల చేశారు అధికారులు.  ఈ క్రమంలోనే ఆ రహదారులకు ప్రత్యామ్నాయంగా తమ ప్రయాణాన్ని ప్లాన్‌ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

అంతేగాదు ఢిల్లీ జైపూర్‌ హైవేపై ఉన్న వరద నీరు, ఆ నీటిలోనే వెళ్తున్న వాహనాలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. రహదారులపై నీరు ఎక్కువగా ఉన్న వేగంగా వెళ్లిపోతున్న వాహనాలను ఆ వీడియోలో చూడవచ్చు. ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగే సరికి వాహనాలన్ని నెమ్మదిగా వెళ్తుంటాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు సుమారు 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే శనివారం కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ...వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. 

మరిన్ని వార్తలు