Heavy Rain In Delhi: ఢిల్లీలో భారీ వర్షం.. అరెంజ్‌ అలెర్ట్‌ జారీ

21 Aug, 2021 10:48 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తుతోంది. గత 24 గంటల్లో(ఉదయం 8 గంటల వరకు) 138.8 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక వర్షపాతమని భారత వాతావరణశాఖ తెలిపింది. ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో వాతావరణశాఖ అధికారులు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. భారీ వర్షంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లపైకి భారీగా చేరిన వరదనీరు చేరడంతో మోటార్లతో అధికారులు వరద నీరు తొలగిస్తున్నారు. 
చదవండి: మనకు తెలిసిన పేరు... తెలియని ఊరు!

నగరంలో శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు 11 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వచ్చే రెండు రోజుల పాటు ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఢిల్లీలోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు. రోడ్లమీద భారీగా నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలోని సష్దర్‌గంజ్‌ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున 2.30 నుంచి 5.30 గంటల వరకు 73.2 సెంటీమీటర్ల వాన నమోదయిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. మరో రెండు వారాలపాటు ఇదేవిధంగా వానలు కురుస్తాయని వెల్లడించింది.

మరిన్ని వార్తలు