శబ్ద కాలుష్యానికి పాల్పడితే తప్పదు భారీమూల్యం..!

10 Jul, 2021 15:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ఎప్పుడు రణగొణ ధ్వనులతో రద్దీగా ఉండే పట్టణ, నగర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అనేక సమస్యలు వస్తాయి. ప్రధానంగా శబ్ద కాలుష్యం బారిన పడేవారికే గుండెపోటు వచ్చే అవకాశాలున్నట్లు పలు పరిశోధనలు ఇప్పటికే స్పష్టం చేశాయి. నగరాల్లో జీవించేవారు శబ్దకాలుష్యం నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఢిల్లీ వంటి నగరాల్లో శబ్ద కాలుష్యం మరీ అధికంగా ఉంటుంది. కాగా, ఢిల్లీలో శబ్ద కాలుష్య నియంత్రణకు.. కాలుష్య నియంత్రణ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. 

శబ్ధ కాలుష్యానికి పాల్పడితే భారీ జరిమానా చెల్లించుకోవాల్సిందే. శబ్ధ కాలుష్యాని పాల్పడే వారిపై సుమారు రూ.లక్ష వరకు జరిమానా వేయాలని కమిటీ సూచించింది. వేడుకలు, ర్యాలీల్లో బాణాసంచా కాలిస్తే రూ.10వేలు జరిమానా విధించనున్నారు. సైలెంట్‌ జోన్లలో బాణాసంచా పేలిస్తే రూ.20వేల జరిమానా విధించాలని కమిటీ సూచించింది. నిబంధనలను మళ్లీ మళ్లీ ఉల్లంఘిస్తే రూ.లక్ష వరకు జరిమానా వేయాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది.

మరిన్ని వార్తలు