Delhi: మొబైల్‌ మింగేశాడు.. ఎండోస్కోపీతో..

20 Jan, 2022 10:00 IST|Sakshi

Delhi: తీహార్‌ జైల్లో శిక్షను అనుభవిస్తున్న ఖైదీ ఒకరు మొబైల్‌ ఫోన్‌ మింగేశాడు. జైలు అధికారులు తన వద్ద మొబైల్‌ ఉన్నట్లు గుర్తిస్తారన్న భయంతో ఖైదీ ఈ పని చేసినట్లు పోలీసులు తెలిపారు. ఖైదీని ఆస్పత్రికి తరలించి ఎండోస్కోపీ ద్వారా మొబైల్‌ను బయటకు తీశారు. జనవరి 5న ఈఘటన జరిగినట్లు జైళ్ల శాఖ ఐజీ సందీప్‌ గోయల్‌ చెప్పారు. చికిత్స పూర్తైన అనంతరం తిరిగి ఖైదీని జైలుకు తరలించామన్నారు. ఖైదీ ఆరోగ్యం స్థిరంగానే ఉందని చెప్పారు.   

చదవండి: (ఒకే కూర.. ఒకే స్వీటు.. మత పెద్దల సంచలన నిర్ణయం) 

మరిన్ని వార్తలు