లగ్జరీ ఫ్లాట్లకు ఫుల్‌ డిమాండ్‌.. ఊపందుకున్న విక్రయాలు

1 Feb, 2022 15:01 IST|Sakshi

పన్నుల రూపంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం

సాక్షి, ముంబై: మూడు నాలుగేళ్లుగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గణనీయంగా పడిపోయిన లగ్జరీ ఫ్లాట్ల డిమాండ్‌ మళ్లీ ఊపందుకుంది. మెల్లమెల్లగా ఈ ఇళ్ల విక్రయాలు పెరుగుతుండటంతో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్, ఇతర పన్నుల రూపంలో ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం వస్తోంది. ఓ సంస్థ అధ్యయనం ద్వారా ఈ వివరాలు తెలిశాయి. గత మూడేళ్ల కాలంలో జరిగిన లావాదేవీలను బట్టి చూస్తే 2021లో లగ్జరీ ఇళ్ల విక్రయాలు అధికంగా జరిగాయి.

చదవండి: (షిప్‌లో ఇల్లు కావాలా? 24 ఏళ్ల వరకు అద్దెకు అపార్ట్‌మెంట్‌లు .. ప్రారంభ ధరెంతో తెలుసా?)

పశ్చిమ, తూర్పు ఉపనగరాలతో పోలిస్తే ముంబై సిటీ అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత రెండో స్థానంలో పశ్చిమ ఉపనగరం, మూడో స్థానంలో తూర్పు ఉప నగరాలున్నాయి. రూ.మూడు కోట్లకంటే ఎక్కువ ధర పలికే ఇళ్లను లగ్జరీ ఫ్లాటు అంటారు. ఈ ఫ్లాట్లు ముఖ్యంగా నగరంలోని లోయర్‌ పరేల్, దాదర్, వర్లీ, శివ్డీ, మాహీం, మాటుంగా, పరేల్, వడాల ప్రాంతాలలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఉన్న లగ్జరీ ఫ్లాట్లను కొనుగోలు చేయడానికి మంచి స్పందన వస్తోంది.

చదవండి: (ఖరీదైన ఇళ్లకు తగ్గని డిమాండ్‌)

ఇదిలా ఉండగా 2021లో ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో నివాస ఇళ్ల రిజిస్టేషన్లు పెరిగాయి. కోవిడ్‌ కారణంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌వల్ల స్టాంపు డ్యూటీ తగ్గించింది. దీంతో సామాన్య ఇళ్లతోపాటు లగ్జరీ ఫ్లాట్ల విక్రయాలు కూడా జోరుగా సాగాయి. ఫలితంగా ప్రభుత్వానికి ఆదాయం రెట్టింపు వచ్చింది. 2019లో–71, 2020లో–77, 2021లో–93 లగ్జరీ ఫ్లాట్ల విక్రయాలు జరిగాయి. 

మరిన్ని వార్తలు