మనవడితో కలిసి బామ్మ నాగిని డాన్స్‌ .. అదుర్స్‌ అంటున్న నెటిజన్స్‌

5 Aug, 2021 11:39 IST|Sakshi

సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఫోటో, వీడియో వైరల్‌ అవుతూనే ఉంటాయి. మన కంటెంట్లు నెటిజన్లను ఆకట్టుకుంటే చాలు విపరీతంగా లైకులు, కామెంట్లు .. అంతెందుకు ఒక్కో సారి మిని సెలబ్రిటీ కూడా అయిపోవచ్చు. తాజాగా తన మ‌న‌వ‌డితో ఓ బామ్మ సరదాగా వేసిన స్టెప్పులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

సాధారణంగా పిల్లలకి వాళ్ల తాతయ్య, అమ్మమతో ఉండే చనువు, ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కంటెంట్ క్రియేటర్ అయిన అంకిత్ జాంగిద్ కొన్ని రోజుల క్రితం తన బామ్మతో కలిసి చేసిన డ్యాన్స్‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అందులో ఓ వృద్ధురాలు తనదైన స్టైల్‌లో చిందులు వేసింది. మ‌న‌వ‌డు త‌న టైని ఫ్లూట్‌లా ప‌ట్టుకుని ఊదుతుంటే.. బామ్మ నేనెందుకు సైలెంట్‌గా ఉండాలనుకుందో ఏమో త‌న అర‌చేతిని నాగుపాము ప‌డ‌గలా పెట్టి నాగిని స్టెప్పులతో అదరగొట్టింది. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారి హల్‌చల్‌ చేస్తోంది.

ఆ వీడియోకి.. ‘మా దాదీలో నా సోల్‌మేట్‌ కనపడుతోంది’ క్యాప్షన్ ఇచ్చాడు.పోస్ట్‌ చేసిన తక్కువ వ్యవధిలోనే ఈ వీడియో లైకులు, కామెంట్లతో నెట్టింట దూసుకుపోతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు బామ్మ డాన్స్‌ భలే అంటూ కామెంట్‌ చేయగా, మరి కొందరు హార్ట్‌ ఈమోజీ పెడుతున్నారు. 

A post shared by ◻️▪️Ankit Jangid▪️◻️ (@ankitjangidd)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు