కంగనతో కాదు.. కరోనాతో పోరాడండి: ఫడ్నవీస్‌

11 Sep, 2020 15:41 IST|Sakshi

మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫడ్నవీస్‌ సూచన

ముంబై: దేశవ్యాప్తంగా కోవిడ్‌ విజృంభణ కొనసాగుతోంది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాలు కరోనా నియంత్రణ మీద దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. కానీ మహారాష్ట్రలో పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం వర్సెస్‌ కంగనగా ఉంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వానికి ఓ సూచన చేశారు. ప్రస్తుత పరిస్థుతుల్లో మీరు పోరాటం చేయాల్సింది కంగనతో కాదు.. కరోనాతో అంటూ హితవు పలికారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్‌ మాట్లాడుతూ.. ‘మహారాష్ట్ర ప్రభుత్వం కరోనాపై పోరాటం చేయాల్సింది పోయి.. కంగనా రనౌత్‌పై యుద్ధం చేస్తోంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కంగనాతో చేసే పోరాటంలో సగం శక్తిని కరోనా విలయం మీద వాడినా మంచి ఫలితం దక్కుతుంది’ అన్నారు. కంగన ఆఫీస్‌ కూల్చివేతపై కూడా స్పందించారు. దావుద్‌ ఇంటిని కూల్చలేదు.. కానీ కంగన కార్యాలయాన్ని పడగొట్టారు ఎందుకు’ అని ప్రశ్నించారు ఫడ్నవీస్‌. (చదవండి: భగత్‌సింగ్‌ను తలపించావ్‌)

ఇక సుశాంత్‌ ఆత్మహత్యతో మొదలైన వివాదం అనేక మలుపులు తిరుగుతూ.. ప్రస్తుతం కంగన వర్సెస్‌ సేనగా మారిన సంగతి తెలిసిందే. ఇక కంగన విషయంలో శివసేన దూకుడు పట్ల పవార్‌ కూడా గుర్రుగానే ఉన్నారు.

మరిన్ని వార్తలు