దేశ్‌ముఖ్‌ వ్యవహారం: సీఎం నోరు విప్పడం లేదేంటి?

6 Apr, 2021 10:42 IST|Sakshi

ముంబై: మంత్రివర్గంలోని వ్యక్తి తప్పుచేస్తే సరిదిద్దా ల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనని కానీ, ఇంత జరి గినా ఉద్ధవ్‌ నోరు విప్పడం లేదని ప్రతిపక్ష నాయ కుడు దేవేంద్ర ఫడ్నవిస్‌ విమర్శించారు. భవిష్యత్తులో ఇది ప్రమాదానికి దారితీసే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక అనిల్‌ దేశ్‌ముఖ్‌కు రాజీనామా చేయడం మినహా మరో ప్రత్యామ్నాయ మార్గం లేదని ఫడ్నవిస్‌ అన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన నైతిక బాధ్యతవహిస్తూ ఇదివరకే రాజీనామా చేయాల్సి ఉందని, కానీ, ఆలస్యంగానైన రాజీనామా చేసి మంత్రి పదవి నుంచి తప్పుకున్నారని ఫడ్నవీస్‌ పేర్నొన్నారు.

రాష్ట్రంలో పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతోందని, అయినప్పటికీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఎందుకు నోరు విప్పడం లేదని ప్రతిపక్షనేత ప్రశ్నించారు. ఆయన మౌనంగా ఉండటం మంచిదికాదన్నారు. నైతిక బాధ్యత కేవలం అనిల్‌ దేశ్‌ముఖ్‌కే ఉందా? ఒక ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌ ఠాక్రేకు లేదా అని బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే నితేశ్‌ రాణే ట్విట్టర్‌లో ప్రశ్నిం చారు. ‘‘అనిల్‌ దేశ్‌ముఖ్‌ తనకు రూ.100 కోట్ల టార్గెట్‌ విధించినట్లు పరంబీర్‌ సింగ్‌ ఆరోపించారు. అందుకు నైతిక బాధ్యత దేశ్‌ముఖ్‌కు ఉంది కాబట్టి రాజీనామా చేశారు. మరి ముఖ్యమంత్రి సంగతేంటి. మిఠీ నదిని వెతుక్కోవల్సి వస్తుందా ఏంటి’’ అని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.  

నిజాలు బయటికి వస్తాయి.. 
బీజేపీ చీఫ్‌ చంద్రకాంత్‌ పాటిల్‌ పుణేలో విలేకరులతో మాట్లాడుతూ.. తప్పులు చేసేవారికి శిక్ష తప్పదని, లేకపోతే ప్రజాస్వామ్యం బలపడదని అన్నారు. 15 రోజుల సీబీఐ దర్యాప్తుతో నిజాలు బయటికి వస్తాయని, సీబీఐ రూ. 100 కోట్ల వసూలు కేసులో అన్ని విషయాలు బయటపెడుతుందని పాటిల్‌ జోస్యం చెప్పారు. అంతేకాకుండా దేశ్‌ముఖ్‌ వ్యవహారంలో శరద్‌పవార్‌ తీరు సంతృప్తిగానే ఉందన్నారు.

రెండు రాజీనామాలు ఉంటాయని 15రోజుల కిందటే చెప్పానని పాటిల్‌ వ్యాఖ్యానించారు. ఇపుడు మరొకటి అనుసరిస్తుందని అన్నారు. మహావికాస్‌ ఆఘాడీ ప్రభుత్వం పడిపోతుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రాజ్యాంగం ప్రకారం వారికి మెజార్టీ ఉందని అప్పటివరకు ఏం కాబోదని తెలిపారు. అయితే ప్రజలు ఇప్పటికే కోవిడ్‌తో కష్టాల్లో ఉన్నారని ఇలాంటివి జరిగితే రాజకీయాలపై వారికి విశ్వాసం పోతుందని ఆవేదన వ్యక్తంచేశారు.

దిలీప్‌కు హోంశాఖ.. 
మహారాష్ట్ర నూతన హోంశాఖ మంత్రి పదవి దిలీప్‌ వల్సే పాటిల్‌ ఎంపికయ్యారు. ఎన్సీపీలో అత్యంత అనుభవమున్న నాయకులల్లో ఒకరైన దిలీప్‌ వల్సే పాటిల్‌ ప్రస్తుతం ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పుణే జిల్లాలో 1956లో జన్మించిన దిలీప్‌ వల్సే పాటిల్‌ 1990లో రాజకీయ ప్రవేశం చేశారు. ఎల్‌ఎల్‌బీ చదివిన దిలీప్‌ వల్సే పాటిల్‌ తండ్రి దత్తాత్రేయ వల్సే పాటిల్‌ మార్గదర్శనంలో రాజకీయాల్లోకి దిగిన ఆయన అంబేగావ్‌ తాలూకాలో యువ నేతగా ముద్ర వేసుకున్నారు.

అనంతరం అంబేగావ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇప్పటి వరకు వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. శరద్‌ పవార్‌కు స్వీయ సహాయకునిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. మరోవైపు 2009 నుంచి 2014 వరకు విధానసభ అధ్యక్ష బాధ్యతలు  నిర్వహించారు.  వైద్య విద్య, ఉన్నత సాంకేతిక విద్య, విద్యుత్‌ శాఖ, ఎక్సైజ్‌ శాఖ, కార్మికశాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
చదవండి: సీడీ యువతి తల్లికి అనారోగ్యం

మరిన్ని వార్తలు