బీస్‌ సాల్‌ బాద్‌... మీరూ అందమైనవాళ్లే

9 Sep, 2021 17:05 IST|Sakshi

సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...!


ముల్లాల పాలన

తాలిబన్‌ ప్రభుత్వంలో 33 మంది ముల్లాలు, అమెరికా ఆంక్షలున్న నలుగురు ఉన్నారు. మహిళలు, ఇతర రాజకీయ వర్గాల ప్రాతినిధ్యం సున్నా. గతించిన ముల్లా ఒమర్‌ కుమారుడు రక్షణ మంత్రి. మారిపోయామని వాళ్లు చెబుతున్నారుగానీ, అది మారేది కాదు.
– క్రిస్టినా ల్యాంబ్, రచయిత్రి


రాజకీయ సముద్రం

లండన్, 1987. మా నాన్న నన్ను పాకిస్తాన్‌ వెళ్లి నా రాజకీయ ప్రస్థానం ప్రారంభించమన్నారు. ఒకాయన అన్నాడు: ‘ఎందుకు అఖ్తర్‌ను పంపుతున్నావు, తనకు అక్కడ ఏమీ, ఎవరూ తెలీదు. పైగా నీకు ఎంతోమంది శత్రువులున్నారు’. మా నాన్న జవాబు: ‘వాడిని సముద్రంలో తోస్తున్నాను. ఈత నేర్చుకుంటాడు, లేదా మునిగిపోతాడు’.
– అఖ్తర్‌ మెంగల్, బలూచిస్తాన్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు


ఎందుకీ మౌనం?

ఏ దేశం కన్నా కూడా అఫ్గాన్‌ వ్యవహారాల పట్ల ఎక్కువ అక్కర చూపించింది తజికి స్తాన్‌. పష్తూన్లు, ఇండియా మాత్రం పైకి తెలిసిపోయేంత నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. లేదా ఉత్సాహం లేనట్టుగా స్పందిస్తున్నారు.  
– బాహర్‌ జలాలి, చరిత్రకారిణి


పట్టింపు ఉందా?

అఫ్గానిస్తాన్‌లోని బమియాన్‌ బుద్ధ విగ్రహా లను నాశనం చెయ్యమని ఆదేశాలిచ్చింది ముల్లా హసన్‌ అఖుంద్‌. ఇప్పుడాయన ప్రధానమంత్రి. ప్రపంచ వారసత్వ సంరక్షకురాలైన యునెస్కో నుంచి ఏమైనా ఖండన ఆశించవచ్చా!
– ఆరిఫ్‌ ఆజకియా, పాకిస్తాన్‌ యాక్టివిస్ట్‌


దిగితే తెలుస్తుంది

జనసమ్మతం కాని అభిప్రాయం: ఇండియాలో ఒక నెలగా వ్యాపారం చేస్తున్న నాకు ఒకటి స్పష్టంగా అర్థమైంది. ఇటీవల– డిజిటల్‌ రంగంలో ఇండియా ఎలా అభివృద్ధి చెందిందో, బిజినెస్‌ ఫ్రెండ్లీ వాతావరణం ఎంత బాగా ఏర్పడిందో అని నాకు ఉపన్యాసాలు దంచిన మూర్ఖులు– పనీపాటా లేనివాళ్లు అయినా ఉండాలి; లేదా, ఎప్పుడూ ఏ వ్యాపారమూ చేయకపోయి అయినా ఉండాలి.
– రాకేశ్‌ నాయక్, ఎంట్రప్రెన్యూర్‌


మీరూ అందమైనవాళ్లే

యువతుల్లో చాలామంది తమ రూపాన్ని ‘ఇన్‌స్టా గ్రామ్‌’ మోడల్‌కు సరి పోయేలా శస్త్రచికిత్స చేసు కోవాలనుకోవడం బాధాకరం. అందం అంటేనే తమకే ప్రత్యేకమైన ముఖం, లక్షణాలు కలిగివుండటం! అది అన్ని రూపాల్లో, సైజుల్లో, రంగుల్లో, ఇంకా ముఖ్యంగా లోలోపలి ఉత్తేజం, వ్యక్తిత్వాలతో వస్తుంది.
– దేవి శ్రీధర్, ప్రొఫెసర్‌


బీస్‌ సాల్‌ బాద్‌...

వాళ్ల తలల మీద లక్షల డాలర్ల ఎఫ్‌బీఐ నజరానాలు ఉన్నవాళ్లు ఇప్పుడు అఫ్గాని స్తాన్‌ మంత్రులవుతున్నారు. 2001 సెప్టెంబర్‌ 11న తాలిబన్లు అధికారంలో ఉన్నారు. తిరిగి 2021 సెప్టెంబర్‌ 11న అధికారం లోకి వస్తున్నారు. రెండు టవర్లు. ఇరవై ఏళ్లు. రెండు లక్షల చావులు. రెండు ట్రిలియన్‌ డాలర్లు (140 లక్షల కోట్ల రూపాయలు).
– ఆనందర్‌ రంగనాథన్, రచయిత

మరిన్ని వార్తలు