పూరీ వెళ్లే భక్తులకు గమనిక.. టీకా సర్టిఫికెట్‌పై కీలక నిర్ణయం

22 Feb, 2022 11:19 IST|Sakshi

పూరీ: ఇకపై పూరీ జగన్నాథుడి దర్శనానికి వచ్చే భక్తులకు టీకా సర్టిఫికెట్, కోవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు అవసరం లేదని ఆలయ పాలక వర్గం ప్రకటించింది. కరోనా కేసులు భారీగా తగ్గినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక పై ఆదివారం మినహా ఇతర రోజుల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తామని అధికారులు చెప్పారు. భక్తులు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని వెల్లడించారు.

మరిన్ని వార్తలు