పునాది గొయ్యిలో 11 వేల లీటర్ల పాలు, పెరుగు, నెయ్యి

28 Dec, 2020 11:08 IST|Sakshi

జైపూర్‌ : ఆలయ నిర్మాణం కోసం తీసిన పునాది గోతిలో 11 వేల లీటర్ల పాలు, పెరుగు, వెన్న పోసి తమ భక్తి, ప్రవత్తులు తెలుపుకున్నారు భక్తులు. ఈ సంఘటన శనివారం రాజస్తాన్‌లోని జలవార్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జలవార్‌ జిల్లాలోని రత్లాయ్‌లో దేవ్‌నారాయణ్‌ ఆలయ నిర్మాణం జరుగుతోంది. ఇందుకు కోసం పునాది గోతిని తీశారు. శనివారం శంకుస్తాపన కార్యక్రమం కోసం పెద్ద మొత్తంలో 11 వేల లీటర్ల పాలు, పెరుగు, నెయ్యిని సేకరించారు. అనంతరం వాటిని పునాది గోతిలో పోశారు. దీనిపై ఆలయ నిర్మాణ కమిటీ అధికార ప్రతినిధి రామ్‌లాల్‌ మీడియాతో మాట్లడుతూ.. ‘‘ శంకుస్తాపన కార్యక్రమం కోసం గుజ్జర్‌, ఇతర కులాలు 11 వేల లీటర్ల పాలు,పెరుగు, నెయ్యి ఇచ్చాయి. ( వెలుగులోకి వేల ఏళ్ల నాటి ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు )

దీని విలువ 1.5 లక్షల రూపాయలు ఉంటుంది. కార్యక్రమానికి ఒక రోజు ముందు మేము వారిని అడిగాము. ఇలా చేయటం ఆచారం కాదు, భక్తితో వారు తెచ్చిచ్చారు. గతంలోనూ కొన్నిసార్లు ఇచ్చారు. దేవుడు మనకిచ్చే వాటితో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. ఇది ఆహారపదార్ధాలను వృధా చేయటం కాదు. భగవంతుడు దేవ్‌నారాయణ్‌ మా పాడిని రక్షిస్తాడు. దాదాపు కోటి రూపాయలతో ఈ గుడి నిర్మాణం జరుగుతోంది. రెండేళ్లలో ఈ నిర్మాణం పూర్తవుతుంద’’ని తెలిపారు. ( భార్యకు చిరకాలం గుర్తుండిపోయే గిఫ్ట్‌)

మరిన్ని వార్తలు