-

కంగనా ఎపిసోడ్ : ఇండిగోకు నోటీసులు

11 Sep, 2020 16:05 IST|Sakshi

సాక్షి,ముంబై: నటి కంగన రనౌత్ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబైలోని తన బాంద్రా బంగ్లాను అక్రమంగా కూల్చివేస్తున్నారంటూ ఇండిగో విమానంలో హుటా హుటిన కంగన  ముంబైకు చేరుకున్నసంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇండిగో చిక్కుల్లో పడింది. సెప్టెంబర్ 9న నటి కంగనా ప్రయాణించిన విమానంలో కోవిడ్-19 ప్రోటోకాల్స్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ ఇండిగో విమానయాన సంస్థకు నోటీసులు జారీ చేసింది. చండీగఢ్-ముంబై విమానంలో చాలామంది మాస్క్ లు ధరించలేదని, భౌతిక దూరాన్నిపాటించలేదంటూ వచ్చిన ఆరోపణలపై నివేదిక సమర్పించాల్సిందిగా ఇండిగోను ఆదేశించింది. 

టీవీ ఛానెళ్ల సభ్యులతో మాట్లాడుతున్న ఒక వీడియోను  ట్విటర్ యూజర్ ఒకరు ట్విటర్లో షేర్ చేస్తూ, ఫేస్ మాస్క్, సామాజిక దూరంపై ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై స్పందించిన డీజీసీఐ ఇండిగోకు తాజా నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై స్పందించిన ఇండిగో తాము నిర్దేశిత నిబంధనలను అన్నీ పాటించామంటూ వివరణ ఇచ్చింది. క్యాబిన్ సిబ్బంది, అలాగే ఫోటోగ్రఫీని పరిమితం చేసే కెప్టెన్   ప్రకటనలతో సహా అవసరమైన అన్ని ప్రోటోకాల్‌లను అనుసరించామని  తెలిపింది. కాగా ముంబైను పాకిస్తాన్‌లో పోల్చుతూ శివసేనపై కంగనారనౌత్ తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ముంబై బంద్రాలోని కంగనా ఆఫీసు అక్రమం నిర్మాణమని బీఎంసీ ఆరోపించింది. అంతేకాదు ప్రొక్లెయినర్లతో అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇండిగో విమానంలో జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ వ్యవస్థాపకుడు అర్నాబ్ గోస్వామి, నటుడు కునాల్ కమ్రా వివాదంలో కమ్రాను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసిన ఉదంతం మరోసారి చర్చనీయాంశమైంది.  

మరిన్ని వార్తలు