‘కాంగ్రెస్‌ కారణంగానే పెట్రోల్‌ ధరలు పెరుగుతున్నాయి’

23 Jun, 2021 22:36 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకూ పెరుగుతూపోతోంది. ప్రజలు కరోనా వైరస్‌తోనే గాక పెరుగుతున్న నిత్యావసరల ధరలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా మరో పక్క దేశంలో పెట్రోల్‌ ధరలు పెరుగుతూ సెంచరీనే దాటేసింది. తాజాగా పెట్రో ధరల పెరుగుదలపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ బుధవారం స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో యూపీఏ ప్రభుత్వం చేసిన పనుల వల్లే పెట్రోల్‌ ధరలు పెరుగుతున్నాయని విమర్శించారు.

కాంగ్రెస్‌ ఆయిల్‌ బాండ్ల ద్వారా రూ.కోట్లు సమీకరించి, తిరిగి చెల్లించలేదని.. ఇప్పుడ తాము అసలు, వడ్డీ కడుతున్నామని తెలిపారు. ధరలు పెరిగేందుకు ఇది కూడా ముఖ్య కారణమనిచెప్పారు. అదే క్రమంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని, దేశానికి అవసరమయ్యే ఆయిల్‌ 80శాతం దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు. ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెట్రోల్‌ పంపుల వద్ద కాంగ్రెస్‌ నిరసనలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. వరుసగా పెరుగుతూ వస్తున్న ధరలపై కేంద్రంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

చదవండి: ప్రధాని కన్నీళ్లు ప్రజల్ని కాపాడలేవు

మరిన్ని వార్తలు