‘అయోధ్యలో భూమి పూజ ఆపండి’

3 Aug, 2020 15:00 IST|Sakshi

న్యూఢిల్లీ: అయోధ్యలో ఆగస్టు 5న నిర్వహించే రామ మందిరం ‘భూమి పూజ’ కార్యక్రమాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సరికాదన్నారు. కార్యమానికి హాజరుకావల్సిన ముఖ్యనేతలు, పూజారులు సైతం కరోనా బారినపడ్డారని తెలిపారు. బుధవారం జరగాలల్సిన ‘భూమి పూజ’ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ప్రధాని నరేంద్రమోదీని దిగ్విజయ్‌ కోరారు. మోదీ రామ మందిర నిర్మాణ ‘భూమి పూజ’ ఆచారాలతో ఎంత మందిని ఆస్పత్రులకు పంపాలనుకుంటున్నారని తీవ్రంగా ప్రశ్నించారు.(అయోధ్యకు వెళ్తా.. అక్కడికి మాత్రం వెళ్లను)

ఈ విషయంపై ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి అదిత్యనాథ్‌ కూడా పరిశీలించాలన్నారు. అదే విధంగా ప్రధానితో చర్చించి భూమి పూజను ఆపాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన పూజారులు, యూపీ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు కూడా కరోనా సోకిందన్నారు. ఇటువంటి సంక్లిష్టమైన సమయంలో సీఎం యోగి, ప్రధాని మోదీ కూడా 14రోజుల పాటు హోం కార్వటైన్‌కు పరిమితం కావాలన్నారు. ‘భూమి పూజ’ కార్యక్రమానికి ఏమాత్రం అనుకూలం కాని తేదీని నిర్ణయించారని మండిపడ్డారు. వేల ఏళ్లనాటి హిందువుల విశ్వాసం కంటే మోదీకి సౌకర్యమైన రోజు నిర్ణయించడం గొప్పదా అని ట్విటర్‌లో మండిపడ్డారు.

మరిన్ని వార్తలు