సుబ్బారావ్‌, ప్యారేలాల్‌.. ఈ వైరస్‌లు ఎందుకు లేవు

24 Jun, 2021 20:57 IST|Sakshi

సైంటిస్టులను ప్రశ్నించిన ఆర్జీవీ

అర్థం కానీ పేర్లేంటంటూ ట్వీట్‌ 

హైదరాబాద్‌ : విచిత్రమైన వ్యాఖ్యలకు విపరీతమైన చేష్టలకు కేరాఫ్‌ అడ్రస్‌ రామ్‌గోపాల్‌ వర్మ. తన ప్రశ్నలు, ప్రవర్తన మనకు నచ్చకపోయినా ... అందులో లాజిక్‌ మనల్ని ఏదో మూలన ఆలోచింప చేస్తుంది. తాజాగా కరోనా వేరియంట్లపై సెటైరిక్‌గా ట్వీట్‌ వదిలాడు వర్మ.

వైరస్‌ వేరియంట్లకు ఎవరికీ అర్థం కాకుండా గుర్తుంచుకోవడం కష్టం అయ్యేలా Bi7172, Nk4421, K9472 ,AV415లాంటి పేర్లు ఎందుకు పెడుతున్నారు ?వైరస్‌ వేరియంట్లకు కూడా ప్యారేలాల్‌, చింటూ, జాన్‌ డేవిడ్‌, సుబ్బారావు ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టడం లేదంటూ సైంటిస్టులను ప్రశ్నించాడు.  కొద్ది మంది వర్మ ప్రశ్నకు సైంటిఫిక్‌ సమాధానాలు ఇవ్వగా మరికొందరు ఈ ఐటమ్‌ తెలివి తేటలతోనే సినిమాలు తీస్తున్నావంటూ వర్మపై సెటైర్లు వేశారు. చాలా మంది నవ్వుకున్నారు. 
 

చదవండి : కోవాగ్జిన్‌కు మరోసారి చుక్కెదురు!

మరిన్ని వార్తలు