ఆత్మహత్యకు ముందు దిశ డాన్స్‌ వీడియో!

8 Aug, 2020 17:08 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకున్న వారం రోజుల ముందు తన మేనేజర్‌ దిశ సాలియన్‌ కూడా ఓ అపార్టుమెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రోజుల వ్యవధిలోనే సుశాంత్‌, దిశ ఆత్మహత్యకు పాల్పడటంతో వీరిద్దరి మృతికి ఏదైన సంబంధం ఉందా అనే అనుమానాలు ​కూడా వ్యక్తం అవుతున్నాయి. జూన్‌ 9 రాత్రి ముంబైలోని మలద్‌ ప్రాంతంలో దిశ ప్రియుడు రోహాన్‌ నివాసంలో పార్టీ జరిగింది. ఆ పార్టీలో దిశ తన బాయ్‌ ఫ్రెండ్‌తో పాటు, మరికొంత మందితో కలిసి పార్టీలో పాల్గొన్నారు. అనంతరం ఆమె పార్టీ జరిగిన అపార్టుమెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పార్టీలో దిశ తన స్నేహితులతో సంతోషంగా డాన్స్‌ చేసిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. (తనపై అత్యాచారం జరుగలేదు, గర్భవతి కాదు)

అందులో దిశ తన స్నేహితులతో ఓ హిందీ సినిమా పాటకు సరదాగా చిందులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దిశ ఆత్మహత్య చేసుకున్నారా? లేదా ఎవరైనా ఆమెను హత్య చేశారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక దిశ సలియన్‌ మృతి కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తూ.. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారం, ఆధారాలు తెలిసినా తమకు ఆ వివరాలు అందించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. (చ‌నిపోయే ముందు దిశ ఎందుకు ఏడ్చింది?)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా