ఈడీ ముందుకు కేపీసీసీ చీఫ్‌ శివకుమార్‌

20 Sep, 2022 05:19 IST|Sakshi

సాక్షి బెంగళూరు: కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌(60) సోమవారం ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో విచారణకు రావాలంటూ గురువారం డీకే శివకుమార్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శివకుమార్‌ వైద్యులతో పాటు ఈడీ విచారణకు హాజరయ్యారు.

కర్ణాటకలో 30 నుంచి ప్రారంభం కానున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ఏర్పాట్లు, అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్న శివకుమార్‌ను ఈడీ విచారణకు పిలవడం గమనార్హం. రూ.75 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై 2020లో సీబీఐ నమోదు చేసిన కేసుకు సంబంధించిన రెండో మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. ఆయన కుమార్తె ఐశ్వర్యను కూడా ప్రశ్నించింది. 

మరిన్ని వార్తలు