మా గవర్నర్‌ అనర్హుడు.. మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు.. రాష్ట్రపతికి మెమోరాండమ్

9 Nov, 2022 10:06 IST|Sakshi

న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తీరుపై.. అక్కడి ప్రభుత్వంలో పేరుకుపోయిన వ్యతిరేకత తారా స్థాయికి చేరుకుంది. శాంతి భద్రతలకు ఆయన్నొక ముప్పుగా పరిణమించారంటూ ఆరోపించిన అధికార డీఎంకే.. ఈ మేరకు ఆయన్ని తప్పించాలంటూ ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒక మెమోరాండమ్‌ సమర్పించింది. 

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రజలకు సేవ చేయకుండా అడ్డుకోవడం మాత్రమే కాదు.. ఆయన మత విద్వేషాల్ని రెచ్చగొడుతున్నాడు అంటూ మెమోరాండమ్‌లో డీఎంకే, దాని మిత్రపక్షాలు ఆరోపించాయి. రాజ్యాంగాన్ని రక్షిస్తానని, చట్టాన్ని పరిరక్షిస్తానని చేసిన ప్రమాణాన్ని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఉల్లంఘించారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కావాలనే జాప్యం చేస్తున్నారు. 

ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తిని పెంచేలా ఆయన చేస్తున్న ప్రకటలను.. ఒకరంగా దేశద్రోహంగా కూడా పరిగణించవచ్చు. రాజ్యాంగ బద్ధమైన పదవికి ఆయన అనర్హుడు. కాబట్టి, తొలగింపునకు ఆయన అన్ని విధాల ఆర్హుడు అంటూ డీఎంకే, రాష్ట్రపతి ముర్ముకి నివేదించింది.

ఇదీ చదవండి: గవర్నర్‌ వైఖరిపై ఎల్‌డీఎఫ్‌ విస్తృతస్థాయి నిరసన

మరిన్ని వార్తలు