విమాన ప్రమాదం: కనిమొళికి చేదు అనుభవం

9 Aug, 2020 17:21 IST|Sakshi

సాక్షి, చెన్నై: ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన కేరళలోని కోళీకోడ్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లిన డీఎంకే నేత, లోక్‌సభ సభ్యురాలు కనిమొళి దయానిధికి చేదు అనుభవం ఎదురైంది. ఘటనాస్థలంలో విధులు నిర్వర్తిస్తున్న సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన ఓ మహిళా జవాను ‘మీరు భారతీయులేనా?’అని ప్రశ్నించి కనిమొళిని అవమానించారు. ఈ విషయాన్ని కనిమొళి ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘ విమానం ప్రమాదం జరిగిన కోళీవుడ్‌ ఎయిర్‌పోర్టుకు ఈ రోజు ఉదయం వెళ్లాను.

అయితే, అక్కడున్న ఓ సీఐఎస్‌ఎఫ్‌ మహిళా జవాను హిందీలో నాతో ఏదో చెబుతోంది. నాకు హిందీ రాదని, దయచేసి తమిళం లేదంటే ఇంగ్లిష్‌లో మాట్లాడమని సూచించాను. దానికి ఆ జవాను స్పందన చూసి మతి పోయింది. హిందీ తెలియదా? ఇంతకూ మీరు భారతీయులేనా? అని ఆమె నన్ను ప్రశ్నించింది. అంటే హిందీ భాష వచ్చినవారు భారతీయులు అన్నట్టేనా!’అని ఎంపీ కనిమొళి ట్విటర్‌లో పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర సర్కారు బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. #hindiimpostion హ్యాష్‌ టాగ్‌ను పోస్టు చేశారు. కాగా, కనిమొళికి కలిగిన అసౌకర్యంపై సీఐఎస్‌ఎఫ్‌ స్పందించింది. దీనిపై విచారణ చేపట్టి బాధ్యురాలిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఏ ఒక్క భాషపై తమకు పక్షపాతం లేదని స్పష్టం చేసింది.
(26కి చేరిన మృతుల సంఖ్య)

async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8">

మరిన్ని వార్తలు