ఆ ఊరిలో ఇంటికో డాక్టర్‌ ఎందుకున్నారు? ఇందుకు ఎవరు ప్రేరణగా నిలిచారు?

26 Aug, 2023 12:37 IST|Sakshi

మనదేశంలోని ఆ గ్రామంలో గల ప్రతి ఇంట్లో వైద్యుడు ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న దేవుని స్వరూపమే వైద్యుడని అంటుంటారు. ఆలోచిస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా పుట్టుకు వస్తున్న రోగాల నుంచి మనకు విముక్తి కల్పించేది వైద్యులే అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

మనం చెప్పుకుంటున్న ఆ గ్రామం మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఉంది. ఇక్కడి ఘరివలి గ్రామంలో దాదాపు ముప్పై కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కుటుంబాలలో ఎక్కువ మంది వైద్యులు ఉన్నారు. ఇక్కడ అన్నింటికన్నా ముఖ్య విషయం ఏమిటంటే ఈ కుటుంబాలకు చెందిన పిల్లలు భవిష్యత్తులో కూడా వైద్యులు కావాలనే సంకల్పంతో ఉన్నారు. ఇక్కడి చిన్నారులు వైద్యులుగా తయారయ్యేందుకు మొదటి నుంచీ ప్రేరణ పొందుతున్నారు. ఈ ప్రపంచంలో మరొకరి ప్రాణాన్ని కాపాడటం కంటే మించినది వేరేదీ లేదని గ్రామస్తులు చెబుతుంటారు. కాగా ఇక్కడ ఉన్న కుటుంబాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అయినప్పటికీ వారి పిల్లలు ప్రతి సంవత్సరం వైద్యులుగా మారుతున్నారు.

ఈ గ్రామంలో వైద్యుల కథ 2000 సంవత్సరంలో మొదలైంది. ఈ గ్రామానికి చెందిన సంజయ్ పాటిల్ అనే యువకుడు తొలిసారిగా ఎంబీబీఎస్ పట్టా అందుకున్నాడు. అతను డాక్టర్ అయ్యాక, అతనితో పాటు అతని కుటుంబం ఆర్థిక స్థితి మెరుగుపడింది. దీంతోపాటు అతని కుటుంబానికి సమాజంగా గౌరవం మరింతగా పెరిగింది. ఇదిమొదలు గ్రామంలోని ప్రతి చిన్నారిలోనూ డాక్టర్ కావాలనే కల చిగురించింది. కుటుంబ సభ్యుల సహకారంతో ఇక్కడి పిల్లలు  డాక్టర్లు కావడానికి ఎంతో కష్టపడుతున్నారు. నేడు ఈ గ్రామంలోని ప్రతి ఇంటిలోనూ వైద్యుడు ఉన్నాడు. 
ఇది కూడా చదవండి: ‘ఏంట్రా ఇదంతా’..‘ఎవర్రా మీరు’.. ‘ఇదేందిది’.. వీటికి బాప్‌ ఈ వీడియో!

మరిన్ని వార్తలు