క‌రోనాతో జూనియ‌ర్ డాక్ట‌ర్ మృతి

27 Jul, 2020 10:56 IST|Sakshi

భోపాల్ : క‌రోనాతో నెల‌రోజులు పోరాడిన ఓ  జూనియ‌ర్ వైద్యుడు  చివ‌రికి ఆసుప‌త్రిలోనే మ‌ర‌ణించాడు. వివ‌రాల ప్ర‌కారం మధ్యప్రదేశ్ నీముచ్ జిల్లాకి చెందిన డాక్ట‌ర్ జోగింద‌ర్ చౌద‌రి (27)కు జూన్ 27న క‌రోనా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉన్న ఆయ‌న ఆరోగ్యం క్షీణించ‌డంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు. 'జోగింద‌ర్‌కు ఇంత‌కు ముందు ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు లేవు. కానీ క‌రోనా కార‌ణంగా మా ఆసుపత్రికి తీసుకొని వ‌చ్చిన‌ప్పుడే అత‌ని ప‌రిస్థితి విష‌మంగా ఉంది. వెంట‌నే ఐసీయూకు త‌ర‌లించి వైద్యుల బృందం నిరంత‌రం ప‌ర్య‌వేక్షించింది. జూలై 16న జోగింద‌ర్ ఆరోగ్యం కాస్తా మెరుగ‌య్యింది. స్నేహితుల‌తో కూడా మాట్లాడిన జోగిందర్‌ తన ఆరోగ్యం మెరుగ‌వుతోందని చెప్పాడు. వైద్యులు ప్ర‌య‌త్నం చేసినా జోగింద‌ర్ ఆరోగ్యం రోజురోజుకూ విష‌మించి చ‌నిపోయాడ‌ని' ఆస్ప‌త్రి ఎండీ డిఎస్ రానా తెలిపారు. (14 లక్షలు దాటిన పాజిటివ్‌ కేసులు)

జోగింద‌ర్ మ‌ర‌ణించాడ‌న్నా వార్త ఇంకా త‌ల్లికి తెలియ‌నివ్వ‌లేదు. హోం క్వారంటైన్‌లో ఉన్న కొడుకు ఆరోగ్య ప‌రిస్థితిపై దిగులు చెంది అనారోగ్యం బారిన ప‌డి ఆమె ప్ర‌స్తుతం  ఆసుప్ర‌తిలో చికిత్స పొందుతోంది. ఓ సాధార‌ణ రైతు కుటుంబుంలో జ‌న్మించిన జోగింద‌ర్ బాబా సాహెబ్ అంబేద్కర్ (బిఎస్ఎ) ఆసుపత్రిలో జూనియర్ డాక్ట‌ర్‌గా విధులు నిర్వ‌ర్తించేవాడు. ఆసుపత్రిలో వైద్య ఖ‌ర్చుల‌కు కూడా డ‌బ్బు లేక‌పోవ‌డంతో  మాఫీ చేయాల‌ని కోరుతూ ఎస్జీఆర్హెచ్ మెడికల్ డైరెక్టర్‌కు జోగింద‌ర్ తండ్రి లేఖ రాశారు.

ఆసుపత్రిలో ఇప్ప‌టికే 3.4 ల‌క్ష‌ల బిల్లు కావ‌డంతో బిఎస్ఎ రెసిడెంట్ డాక్ట‌ర్స్ అసోసియేష‌న్ కూడా జోగింద‌ర్ ప‌రిస్థితిని వివ‌రిస్తూ ఆర్థిక స‌హాయం అందించాల్సిందిగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాసింది. నిధులు సమ‌కూరు‌స్తుండ‌గానే డా. జోగింద‌ర్ క‌న్నుమూశాడు. పుట్‌బాల్ స‌హా వివిధ  క్రీడల‌పై ఆస‌క్తి ఉన్న జోగింద‌ర్ వివాహం త్వరలోనే జరగాల్సి ఉంది.  అయితే జీవితంపై ఎన్నో క‌ల‌లతో ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్న జోగింద‌ర్ అవి తీర‌కుండానే మృత్యుఒడిలోకి జారుకున్నాడు.  (బీజేపీ ఎమ్మెల్యేకు ప్రియాంక తేనీటి ఆహ్వానం)

మరిన్ని వార్తలు