బొటన వేలు అతికించటానికి 7 గంటలు

11 Feb, 2021 18:50 IST|Sakshi
ఆపరేషన్‌ నిర్వహించిన వైద్యుడితో రోహాన్‌

ముంబై : ప్రమాదంలో తెగిపోయిన ఓ వ్యక్తి బొటన వేలు భాగాన్ని అతికించటానికి దాదాపు ఏడు గంటల పాటు తీవ్రంగా శ్రమించి విజయం సాధించారు డాక్టర్లు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. వివరాలు.. ముంబైకి చెందిన రోహాన్‌ అజ్‌గాంకర్‌(42)కు బైక్‌ విన్యాసాలు చేయటం అంటే సరదా. దీంతో భార్య జాగృతి ఓ బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. కొద్దిరోజుల క్రితం అతడు  తడి బట్టతో ఆ బైక్‌ను తుడుస్తున్నాడు. ఆ సమయంలో బైక్‌ ఇంజిన్‌ ఆన్‌లో ఉంది. ఈ నేపథ్యంలో అతడి ఎడమ చేయి బొటన వేలు చైన్‌లో ఇరుక్కుపోయింది. సెకన్లలో చెయ్యిని వెనక్కు లాక్కున్నాడు. వేలునుంచి బుడబుడా రక్తం కారసాగింది. ( కలలో ప్రత్యక్షం: శివుడి కోసం సమాధిలోకి మహిళ )

అయితే అదో చిన్న గాయంగా భావించిన అతడు బొటన వేలిని పరీక్షగా చూసి షాక్‌ అయ్యాడు. వేలి పైభాగం కనిపించలేదు. దానికోసం వెతగ్గా ఐదు అడుగుల దూరంలో కనిపించింది. వెంటనే పరెల్‌లోని గ్లోబల్‌ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు దాదాపు ఏడు గంటల పాటు శస్త్ర చికిత్స చేసి వేలిని అతికించారు. కాగా, తను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ బైక్‌ కారణంగానే భర్తకు ప్రమాదం జరగటంతో భార్య జాగృతి బాధతో కుమిళిపోతోంది. 

చదవండి : నానమ్మను గుర్తు చేసిన ప్రియాంక.. ఫోటోలు వైరల్‌

మరిన్ని వార్తలు