సంగీతంతో ఒత్తిడికి చెక్‌

25 Apr, 2021 14:42 IST|Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌లో పెద్ద సంఖ్యలో వైద్యులు కరోనా బారిన పడుతున్నారు. ప్రజలకు చికిత్స అందించాల్సిన వైద్యులే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అంచనాల ప్రకారం ఇప్పటివరకు భారత్‌లో 747 మంది వైద్యులు కోవిడ్‌-19తో మృతి చెందారు. కళ్ల ముందే ప్రజలు పిట్టల్లా రాలిపోతూ ఉండడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.

నిద్రలేని రాత్రులు గడుపుతూ, కుటుంబాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి రావడంతో వైద్యులు ఒత్తిడి నుంచి దూరమవడానికి సంగీతాన్నే మార్గంగా ఎంచుకున్నారు. సంగీతంతో కరోనా రోగుల్లోనే కాకుండా, వైద్యుల్లో కూడా ఒత్తిడి  మాయమవుతుందని డాక్టర్‌ అనినా పటేల్‌ చెబుతున్నారు. వైద్యుల డ్యాన్స్‌ వీడియోలు ట్రోల్‌ అవుతున్నా కరోనా ఒత్తిడిని జయించడానికి సంగీతమే మార్గమని వారంటున్నారు.

చదవండి: దేశంలో కొత్తగా 3,49,691 కరోనా కేసులు

మరిన్ని వార్తలు