ఆవు పేడతో తగ్గుతున్న కరోనా, ఆందోళనలో డాక్టర్లు?

11 May, 2021 15:20 IST|Sakshi

గాంధీ నగర్‌ : ఆవుపేడ ఒంటికి రాసుకుంటే కరోనా తగ్గుతుందని చాలా మంది నమ్ముతున్నారు. కానీ అలా చేస్తే మొదటికే మోసం​ వస్తుందని, కరోనాతో పాటు ఇతర వ్యాధులు సోకే ప్రమాదం ఉందని డాక్టర్లు ఆందోళన. భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ విలయం తాండవం చేస్తోంది. ఆస్పత‍్రుల్లో బెడ్లు లేక, ఆక్సిజన్‌ కొరత కారణంగా ఇప్పటి వరకు 2,26,62,575 మందికి కరోనా సోకగా 2,49,992 మరణించారు. అయితే ఈ మరణాల సంఖ్య ఐదు నుంచి 10 రెట్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.    

అయితే అహ్మదాబాద్‌ రాష్ట్ర ప్రజలు ఒంటికి ఆవు పేడ పూసుకుంటే కరోనా తగ్గిపోతుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని గోశాలలకు క్యూ కడుతున్నారు.ఈ ఆచారంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జెఎ జయలాల్ ఆవుపేడ తో వ్యాధినిరోధక శక్తి పెరిగిపోతుందని ఎలాంటి ఆధారాలు లేవన్నారు. 'నాకు గతేడాది కరోనా సోకింది. రుషులు నిర్వహిస్తున్న శ్రీస్వామినారాయాణ గురుకుల్‌ విశ్వవిద్యాలయంలో ఆవుపేడతో కరోనా తగ్గుతుందని నా సన్నిహితులు చెబితే నేనూ అదే చేశాను.నాకు కోవిడ్‌ తగ్గిపోయింది అంటూ ఫార్మా కంపెనీ అసోసియేట్ మేనేజర్ గౌతమ్ మనీలాల్ బోరిసా' తన అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను ఇదే ఆశ్రమంలో చాలామంది డాక్టర్లును చూశాను. వాళ్లు కూడా ఆవుపేడతో కరోనా తగ్గుతుందని నమ్ముతున్నారని చెప్పారు. 

కరోనా బాధితులు శ్రీస్వామినారాయాణ గురుకుల్‌ విశ్వవిద్యాలయంలో దొరికే ఆవుపేడను ఒంటికి అప్లయ్‌ చేసుకుంటారు. ఆ పేడ ఎండిపోయే వరకు అలాగే ఉంటారు. కొంతమంది ఆవుల్ని కౌగిలించుకుంటారు. అలా కౌగిలించుకోవడం వల్ల ఇమ్యూనిటీ లెవల్స్‌ పెరుగుతాయని వారి నమ్మకం. ఆ తర్వాత ఆశ్రమంలో దొరికే పాలు, లేదంటే మజ్జిగతో శరీరాన్ని శుభ్రం చేసుకుంటారని మనీలాల్ బోరిసా తెలిపారు.  

చదవండి : చేతులెత్తేసిన కేంద్రం, వలస కార్మికులకు నో ఫ్రీ రేషన్‌

 

మరిన్ని వార్తలు