కరోనా నిబంధనలు బ్రేక్‌.. కుక్క అరెస్టు

6 May, 2021 15:10 IST|Sakshi

ఇండోర్‌: చట్టం ముందు అందరూ సమానమే అని ఓ నిబంధన మన రాజ్యాంగంలో ఉంది. ఇండోర్‌ పోలీసులు ఈ నిబంధనను తూచా తప్పకుండా పాటించారు. ఎలా అంటారా ? కరోనా నిబంధనలు పాటించలేదని యజమానితో పాటు ఉన్న కుక్కను కూడా అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ భారత్‌లో విలయతాండవం చేస్తోంది. దీంతో వైరస్‌ కట్టడికి ఇప్పటికే రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకురాగా.. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ కూడా విధించాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సైతం నైట్‌కర్ఫ్యూను అమలు చేస్తోంది. రాష్ట్రంలో కరోనా నిబంధనలు అమలులో ఉండగా ఇండోర్‌లోని పలాసియా ప్రాంతంలో ఓ వ్యాపారవేత్త తన పెంపుడు కుక్కను తీసుకొని బయటకు తీసుకువచ్చాడు. అదే సమయంలో కర్ఫ్యూను అమలు చేసేందుకు పోలీస్ బృందం పెట్రోలింగ్‌ వచ్చారు. ఆ బృందానికి ఈ వ్యక్తి కుక్కతో బయట తిరగడం కనిపించింది. ఇంకేముంది యజమానినే గాక కుక్కని కూడా అదుపులోకి తీసుకొని జైలుకు పంపారు. అయితే.. కుక్క అరెస్టుపై జంతు ప్రేమికులు నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ అరెస్టు సోషల్‌ మీడియాల్లో సంచలనంగా మారింది.

( చదవండి: వైరల్‌: ఈ కుక్కకి రోడ్ల పై చెత్త వేస్తే నచ్చదు.. )

మరిన్ని వార్తలు