గామీణ ప్రాంతాల్లోనూ 5జీ ట్రయల్స్‌!

31 May, 2021 14:35 IST|Sakshi

న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ 5జీ పరీక్షలు జరిపేలా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ ఆదేశాలు వెలువరించే అవకాశం ఉంది. ఆరు నెలలపాటు ట్రయల్స్‌ నిర్వహించుకునేలా భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియాకు కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, కోల్‌కత, బెంగళూరు, గుజరాత్‌లో ఈ పరీక్షలు జరుగుతాయి. టెస్టుల్లో భాగంగా టెలి మెడిసిన్, టెలి ఎడ్యుకేషన్, డ్రోన్‌ ఆధారిత వ్యవసాయం తీరును సైతం పర్యవేక్షిస్తారు. 

అనుమతి రుసుము చెల్లించిన తర్వాత ఎంటీఎన్‌ఎల్‌కు కూడా ట్రయల్‌ స్పెక్ట్రం కేటాయించనున్నారు. ఢిల్లీలో 5జీ ట్రయల్స్‌ కోసం సీ-డాట్‌తో ఈ సంస్థ చేతులు కలిపింది. భారత్‌లో 5జీ పరీక్షల కోసం ఎరిక్సన్, నోకియా, శామ్‌సంగ్, సి-డాట్‌ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే వినియోగించుకునేందుకు అనుమతి ఉంది. చైనా కంపెనీలకు ఈ విషయంలో అవకాశం ఇవ్వలేదు. రిలయన్స్‌ జియో తన సొంత టెక్నాలజీతోపాటు శామ్‌సంగ్‌ నెట్‌వర్క్‌ గేర్స్‌ను వినియోగిస్తున్నట్టు సమాచారం. 4జీతో పోలిస్తే 5జీ డౌన్‌లోడ్‌ వేగం పదిరెట్లు మెరుగ్గా ఉంటుందని టెలికం శాఖ అంచనా వేస్తోంది.

చదవండి: స్పేస్ ఎక్స్ కు పోటీగా దూసుకెళ్తున్న వన్‌వెబ్ 

మరిన్ని వార్తలు