వామ్మో..! యాసిడ్‌ తాగేసిన తహసీల్దార్‌

9 Jun, 2021 20:14 IST|Sakshi
యాసిడ్‌ తాగాక ముందు పంటపొలాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్‌

జమ్మూ: విధుల్లో భాగంగా తహసీల్దార్‌ ఓ గ్రామానికి వెళ్లగా అక్కడ పని ముగిసిన తర్వాత దుకాణంలో నీళ్ల బాటిల్‌గా భావించి యాసిడ్‌ బాటిల్‌ తీసుకుని తాగేశాడు. వెంటనే అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది. అయితే దుకాణదారుడు నీళ్ల బాటిల్‌ అనుకుని పొరపాటున యాసిడ్‌ బాటిల్‌ ఇచ్చాడు. దీంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన జమ్మూకశ్మీర్‌లో బుధవారం జరిగింది.

కుల్గాం జిల్లాలోని దమాల్‌ హంజిపూర ప్రాంత తహసీల్దార్‌ నియాజ్‌ అహ్మద్‌ ఓ గ్రామంలో సాగు చేస్తున్న గసగసాల పంట పొలాలను పరిశీలించారు. అనంతరం వాటిని ధ్వంసం చేసి ఉదయం 11 గంటల సమయంలో అక్కడే ఉన్న ఓ దుకాణానికి వెళ్లారు. నీళ్ల బాటిల్‌ అడగ్గా దుకాణదారుడు పొరపాటున యాసిడ్‌ బాటిల్‌ ఇచ్చాడు. ఇది గమనించకుండా తహసీల్దార్‌ నియాజ్‌ అహ్మద్‌ తాగేశాడు. తాగిన వెంటనే ఆయన అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే తోటి ఉద్యోగులు స్థానికులతో కలిసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన దమాల్‌ హంజిపురలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు దుకాణదారుడిని అరెస్ట్‌ చేసి అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

చదవండి: అయ్యో పాపం.. అదా రాణి! 

మరిన్ని వార్తలు