Draupadi Murmu: నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని మోదీ, అమిత్‌ షా అభినందలు

25 Jul, 2022 15:05 IST|Sakshi

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమం.. అప్‌డేట్స్‌

TIME: 3.00PM
రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపదికి ముర్ముకు  దేశం నలుమూలల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నూతన రాష్ట్రపతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు.  దేశానికి ఇదొక ఉద్వేగభరిత క్షణాలని హర్షం వ్యక్తం చేశారు.

TIME: 2.30PM
కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ముకు అభినందనలు తెలిపారు. ముర్ము తన పదవీకాలంలో దే శ గర్వాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని నమ్మకం ఉందన్నారు. నేడు చరిత్రలో నిలిచిపోయే రోజు అని అన్నారు.

11:35AM

► రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. ఆమె మొదటి గార్డ్ ఆఫ్ ఆనర్‌ను తనిఖీ చేశారు. 

11:00AM
రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ద్రౌపది ముర్ము

10:48AM

గుర్రపు కవాతు నడుమ అధికారిక వాహనంలో రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

10:47AM

పార్లమెంట్‌ హాల్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

హాల్‌ నుంచి బయటకు వచ్చిన రాష్ట్రపతి ముర్ము. వెంట.. సీజే ఎన్వీ రమణ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు,  స్పీకర్‌ ఓం బిర్లా. గౌరవ వందనం స్వీకరణ.

► 10:44 AM

ముర్ము ప్రసంగం అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. అనంతరం ప్రధాని , కేంద్ర మంత్రులు,  ఎంపీలు, ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులకు అభివాదం చేశారు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 

► 10:15AM
రాష్ట్రపతి హోదాలో ముర్ము తొలి ప్రసంగం
జాతినుద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం
దేశ ప్రజలకు కృతజ్ఞతలు
నాపై మీరు చూపిన ప్రేమ, అభిమానం, నమ్మకం  రాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తించడానికి ప్రోత్సహిస్తాయి
దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టేందుకు కృషి చేస్తా


మా గ్రామం పదో తరగతి చదువుకున్న మొదటి బాలికను నేను: ముర్ము
భారత్‌ ప్రగతి పథంలో నడుస్తోంది. ఇంకా వేగంగా అభివృద్ది చెందాలని ఆశిస్తున్నా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

► 10:12AM
భారత రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణం
భారత దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు ద్రౌపది ముర్ము. ప్రమాణం చేయించారు భారత దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. అనంతరం పదవీ పత్రాలపై ఆమె సంతకాలు చేశారు.

► 10:08AM
పార్లమెంట్‌కు చేరిన కోవింద్‌, ముర్ము

పార్లమెంట్‌కు చేరుకున్న రామ్‌నాథ్‌ కోవింద్‌, ద్రౌపది ముర్ము. వెంట సుప్రీం కోర్టు సీజే ఎన్వీ రమణ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ముర్ముకు త్రివిధ దళాల గన్‌ సెల్యూట్‌.

► 10:00AM

 పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో 15వ రాష్ట్రపతిగా సీజే ఎన్వీ రమణ సమక్షంలో ప్రమాణం చేయనున్న ద్రౌపది ముర్ము.

► పార్లమెంట్‌కు బయలుదేరిన రామ్‌నాథ్‌ కోవింద్‌, ద్రౌపది ముర్ము. 

► రాష్ట్రపతి ఫోర్‌కోర్టులో గౌరవ వందనం స్వీకరించిన రామ్‌నాథ్‌ కోవింద్‌, ద్రౌపది ముర్ము.

► రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీకి ద్రౌపది ముర్ము నివాళులు. 

► ఉదయం 10గం.15ని. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్న ద్రౌపది ముర్ము

► ప్రమాణం తర్వాత 21 గన్‌ సెల్యూట్‌ స్వీకరించనున్న ద్రౌపది ముర్ము. 

► ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ఉప రాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్‌ తదితరులు పాల్గొననున్నారు.

► ప్రమాణం అనంతరం నూతన రాష్ట్రపతిగా ముర్ము ప్రసంగిస్తారు.

భారత 15వ రాష్ట్రపతిగా గిరిజన ఆడబిడ్డ ద్రౌపది ముర్ము(64) ఇవాళ(సోమవారం) ప్రమాణం చేయనున్నారు.

► పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఉదయం 10.15 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.

► సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించనున్నారు. 

► తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌ 1950 జనవరి 26న ప్రమాణం చేశారు. అయితే.. 1977 తర్వాత జూలై 25వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్న పదో రాష్ట్రపతిగా ముర్ము చరిత్రలో నిలిచిపోనున్నారు.

► నీలం సంజీవరెడ్డి ఆరవ రాష్ట్రపతిగా 1977 సంవత్సరం జూలై 25న ప్రమాణం చేశారు.

► ప్రమాణ స్వీకారం, ప్రసంగం తర్వాత ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. అక్కడ సైనిక సిబ్బంది ఆమెకు గౌరవ వందనం సమర్పిస్తారు.

మరిన్ని వార్తలు