డిఫెన్స్‌ టెక్నాలజీలో రెగ్యులర్‌ ఎంటెక్‌ ప్రోగ్రామ్‌

9 Jul, 2021 06:15 IST|Sakshi

ప్రారంభించిన డీఆర్‌డీఓ, ఏఐసీటీఈ

న్యూఢిల్లీ:  డిఫెన్స్‌ టెక్నాలజీలో కొత్తగా రెగ్యులర్‌ ఎంటెక్‌ ప్రోగ్రామ్‌ను డీఆర్‌డీఓ, ఏఐసీటీఈ సంయుక్తంగా ప్రారంభించాయి. డీఆర్‌డీఓ చైర్మన్‌ డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డి, ఏఐసీటీఈ చైర్మన్‌ ప్రొఫెసర్‌ అనిల్‌ డి.సహస్రబుద్ధి గురువారం వర్చువల్‌గా ఈ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టారు. రక్షణ సాంకేతిక రంగంలో అభ్యర్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఈ కొత్త కోర్సు పునాది వేస్తుందని నిపుణులు సూచించారు. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంటుంది. కోర్సు నిర్వహణకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ సైంటిస్ట్స్‌ టెక్నాలజిస్ట్స్‌(ఐడీఎస్‌టీ) సహకారం అందించనుంది. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ విధానంలో అభ్యసించవచ్చు. ఇందులో కాంబాట్‌ టెక్నాలజీ, ఏరో టెక్నాలజీ, నావల్‌ టెక్నాలజీ, కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ అండ్‌ సెన్సార్స్, డైరెక్టెడ్‌ ఎనర్జీ టెక్నాలజీ, హై ఎనర్జీ మెటీరియల్స్‌ టెక్నాలజీ అనే ఆరు విభాగాలు ఉంటాయి. 

మరిన్ని వార్తలు