డీఆర్‌డీవో, ఐటీఆర్‌ చాందీపూర్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు

26 Oct, 2021 15:31 IST|Sakshi

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న డీఆర్‌డీవో–ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌(ఐటీఆర్‌).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరాఖాస్తులు కోరుతోంది.
► మొత్తం ఖాళీల సంఖ్య: 116

► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు–50, డిప్లొమా(టెక్నీషియన్‌) అప్రెంటిస్‌లు–40, ట్రేడ్‌ అప్రెంటిస్‌లు–26.

► గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీబీఏ, బీకాం, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.

► డిప్లొమా(టెక్నీషియన్‌) అప్రెంటిస్‌లు: విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్,సివిల్,సినిమాటోగ్రఫీ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

► ట్రేడ్‌ అప్రెంటిస్‌లు: ట్రేడులు: కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, మెకానిక్‌ పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ తదితరాలు.అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

► 2019, 2020, 2021లో అర్హత కోర్సు ఉత్తీర్ణులైన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

► ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షలో సాధించిన మార్కులు/ఆన్‌లైన్‌ పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 01.11.2021

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.11.2021

► వెబ్‌సైట్‌: www.drdo.gov.in

మరిన్ని వార్తలు