డ్రైవర్ రహిత తొలి మెట్రో రైలు ప్రారంభం

28 Dec, 2020 12:01 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ:  మానవ తప్పిదాలను తగ్గించే లక్ష్యంతో సిద్ధమైన డ్రైవర్‌ రహిత ట్రైన్‌ సర్వీసు తొలిసారిగా పట్టాలెక్కింది. డ్రైవర్‌ రహిత తొలి మెట్రో రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్పరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోలోని మెజెంటా లైన్‌ (జనక్‌పురి వెస్ట్‌ –బొటానికల్‌ గార్డెన్‌)లో ఈ సర్వీసుకు ప్రధాని పచ్చజెండా ఊపారు. లైన్-7, లైన్-8 నెట్‌వర్క్‌లో డ్రైవర్‌లెస్ మెట్రో రైలు పరుగులు తీయనుంది. కమాండ్‌ సెంటర్ల ద్వారా డ్రైవర్‌ లెస్ రైలు నియంత్రణ జరుగుతుంది. 2021 మధ్య నాటికి ఢిల్లీ మెట్రోలోని 57 కిలోమీటర్ల  పింక్‌ లైన్‌లో డ్రైవర్‌లెస్‌ ట్రైన్‌ సర్వీసులు ప్రారంభమవుతాయన్న విషయం తెలిసిందే. చదవండి: సీఎం రావత్‌కు అస్వస్థత, ఎయిమ్స్‌కు తరలింపు

మరిన్ని వార్తలు