దివ్యాంగ వృద్ధుడికి డ్రోన్‌ ద్వారా పెన్షన్‌

21 Feb, 2023 06:37 IST|Sakshi

నౌపడ: హితారామ్‌ సత్నామీ. వయోభారంతో ఆరోగ్యం క్షీణించిన వృద్ధుడు. పైగా దివ్యాంగుడు. ఒడిశా రాష్ట్రం నౌపడ జిల్లాలో మారుమూల గ్రామం భుత్కాపడని నివసిస్తున్నాడు. ఒడిశా ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మధుబాబు పెన్షన్‌ యోజన’ లబ్ధిదారుడు. స్వయంగా నడవలేడు. ప్రతినెలా దట్టమైన అడవిలో రెండు కిలోమీటర్లు ఇతరుల సాయంతో ప్రయాణించి, పంచాయతీ కార్యాలయానికి వెళ్లి పెన్షన్‌ తెచ్చుకొనేవాడు. ఫిబ్రవరిలో మాత్రం అతడికి ఈ ప్రయాణ బాధ తప్పింది.

గ్రామ సర్పంచి డ్రోన్‌ ద్వారా పెన్షన్‌ అందజేసే ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం. సర్పంచ్‌ సరోజ్‌ అగర్వాల్‌ డ్రోన్‌ ద్వారా పెన్షన్‌ డబ్బులను తన ఇంటి వద్దకే చేర్చారని హితారామ్‌ సత్నామీ ఆనందం వ్యక్తం చేశాడు. వృద్ధుడు హితారామ్‌ గురించి తెలిసిన తర్వాత సొంత డబ్బులతో ఆన్‌లైన్‌లో డ్రోన్‌ కొనుగోలు చేశామని, ప్రతినెలా డ్రోన్‌ సాయంతో అతడికి పెన్షన్‌ అందజేయాలని నిర్ణయించామని సర్పంచ్‌ సరోజ్‌ అగర్వాల్‌ చెప్పారు.    

మరిన్ని వార్తలు