రైలులో మద్యం మత్తులో...

7 Oct, 2023 06:11 IST|Sakshi

ఝాన్సీ: ఇటీవల విమానంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన సంఘటన గురించి విన్నాం. అలాంటి ఘటనపై ఉత్తరప్రదేశ్‌లో రైలులో జరిగింది. 19 ఏళ్ల రితేశ్‌ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ ఏసీ కంపార్ట్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తూ కింది బెర్తుపై నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై మద్యం మత్తులో మూత్ర విసర్జన చేశాడు. అతడిని అరెస్టు చేశామని  ఆరీ్పఎఫ్‌ పోలీసులు శుక్రవారం తెలిపారు.

అయితే, అతడు ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయలేదని తేలినట్లు చెప్పారు. మూత్ర విసర్జన ఘటన జరగ్గానే దంపతులు రైలులో ఉన్న టీటీఈకి ఫిర్యాదు చేశారు టీటీఈ ఝాన్సీ రైల్వే స్టేషన్‌కు సమాచారం చేరవేశాడు. రైలు ఝాన్సీ స్టేషన్‌కు చేరుకోగా పోలీసులు రితేశ్‌ను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు. రైల్వే చట్టం ప్రకారం జరిమానా చెల్లించిన రితేశ్‌ను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.  

మరిన్ని వార్తలు