ఆ పాటతో రాత్రికి రాత్రే స్టార్‌ సింగర్‌గా మారిన ఖైదీ! వెల్లువలా ఆఫర్లు

14 Jan, 2023 13:45 IST|Sakshi

ఇంతవరకు మనం ఎంతోమంది మట్టిలో మాణక్యలాంటి సింగర్‌ల గురించి విన్నాం. అదీ కూడా పల్లెటూరు నేపథ్యం నుంచి వచ్చిన సాధారణ మహిళలు, పురుషులు సింగర్‌ మాదిరి అద్భుతంగా పాడి ప్రశంసలందుకున్నారు. వారిలో కొందరైతే సినిమాల్లో పాడే అవకాశాన్ని కూడా కొట్టేశారు కూడా. అవన్నీ ఒకతైతే ఇక్కడొక ఖైదీ ఏకంగా ఒక పాటతో స్థార్‌ సింగర్‌గా పేరు సంపాదించేసుకున్నాడు. పైగా అవకాశాలు కూడా వెల్లువలా వచ్చేయడమే  కాకుండా ఆ వ్యక్తిని విడుదలయ్యేలా చేస్తామని  ఓ ఎమ్మెల్యే చెప్పడం విశేషం.

వివారాల్లోకెళ్తే...కంగయ్య కుమార్‌ అనే వ్యక్తి బిహార్‌ జైలులో ఉండే ఖైదీ. ఐతే ఒక రోజు భోజ్‌పురికి సంబంధించిన ఫేమస్‌ పాట పాడాడు. ఆ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఒక్కసారిగా నెటిజన్లంతా అతడి వాయిస్‌కి అతను పాడిన విధానానికి ఫిదా అయ్యారు. దీంతో అతన్ని బయటకు తీసుకువచ్చి పాటలు పాడే అవకాశం ఇవ్వాలనుకున్నారు బాలీవుడ్‌ ప్రముఖ గాయకుడు అంకిత్ తివారీ.

అతన్ని టాలెంట్‌ నాలుగు గోడలకే పరిమితకాకుండా అతన్ని బయట వచ్చేలా చట్టపరమైన సాయం అందించి పునరావాసం కల్పించాలనుకున్నారు ఒక యూపీ ఎమ్మెల్యే. ఏది ఏమైతే ఒక పాటతో కంగయ్య అందరీ మనసులను దోచుకున్నాడు. ఏకంగా విడుదలయ్యే అవకాశం తోపాటు పాటలు పాడే అవకాశం ఇచ్చేందుకు బాలీవుడ్‌ ప్రముఖ గాయకులు ముందకు వచ్చారు.  వాస్తవానికి కంగయ్య బిహార్‌లోని కైమూర్‌ జిల్లా నివాసి. అతను పని కోసం ఉత్తప్రదేశ్‌ సరిహద్దు జిల్లాకు వెళ్లి మద్యం సేవించి వచ్చాడు. ఐతే బిహార్‌లో మద్యం చట్టాలను కట్టుదిట్టం చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే బిహార్‌ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడంతో అతను జైల్లో ఉన్నాడు. కంగయ్య జైల్లో దరోగజీ హో... సోచి-సోచి జియా హమ్రో కహే గబ్రతా..." అనే ప్రసిద్ధ భోజ్‌పురి పాటను పాడాడు.  వాస్తవానికి కంగయ్య లాకప్‌లో ఉండగా ఎవరో ఒక వ్యక్తి ఆపాటను తప్పుగా పాడటంతో..అది కరెక్ట్‌ కాదని చెప్పేందుకు పాడాడు. అది సంగీత ప్రియులను ఎంతో ఆకట్టుకోవడంతో అద్భుతమైన అవకాశాన్ని కొట్టేశాడు. 

(చదవండి: ఎయిర్‌ ఇండియా ఘటన: పశ్చాత్తాపం లేకుండా ఆరోపణలా!)

మరిన్ని వార్తలు