డీఎస్‌ఎస్‌ఎస్‌బీలో 7236 ఉద్యోగాలు

17 May, 2021 16:29 IST|Sakshi

నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ(ఎన్‌సీటీ ఢిల్లీ) ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ సబార్డినేట్‌ సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డ్‌(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 7236
► పోస్టుల వివరాలు: ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ)–6258, అసిస్టెంట్‌ టీచర్‌ (ప్రైమరీ, నర్సరీ)–628, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌–278, కౌన్సిలర్‌–50, పట్వారీ–10.

ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ):
సబ్జెక్టులు: హిందీ, నేచురల్‌ సైన్స్, మ్యాథ్స్, సోషల్‌ సైన్స్, బెంగాలీ. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఏ(ఆనర్స్‌), బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి. వయసు: 32 ఏళ్లు మించకూడదు.

అసిస్టెంట్‌ టీచర్‌(ప్రైమరీ, నర్సరీ):
 అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతోపాటు నర్సరీ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌లో డిప్లొమా/సర్టిఫికేట్‌ కోర్సు చేసి ఉండాలి. వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

► జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌:
 అర్హత: మెట్రిక్యులేషన్‌/సెకండరీ స్కూల్‌ ఎగ్జామినేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు, హిందీలో 30 పదాలు టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి. వయసు: 18–27 ఏళ్ల మధ్య ఉండాలి. 

కౌన్సిలర్‌: అర్హత: సైకాలజీ/అప్లైడ్‌ సైకాలజీలో బ్యాచిలర్స్‌ డిగ్రీతో పాటు కౌన్సిలింగ్‌ సైకాలజీలో పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవం ఉండాలి.
పట్వారీ: అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీతో పాటు ఉర్దూ /హిందీలో పని అనుభవం ఉండాలి. వయసు: 21–27 ఏళ్ల మధ్య ఉండాలి.

► ఎంపిక విధానం: వన్‌ టైర్‌/టూ టైర్‌ ఎగ్జామినేషన్‌ స్కీమ్, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 25.05.2021
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 24.06.2021
► వెబ్‌సైట్‌: dsssb.delhi.gov.in

మరిన్ని నోటిఫికేషన్లు:
ఐఐఐటీ శ్రీసిటీలో టీచింగ్‌ కొలువులు

సీడ్యాక్, హైదరాబాద్‌లో 44 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

>
మరిన్ని వార్తలు