-

‘వారసత్వ రాజకీయాలు విషతుల్యం’

21 Aug, 2023 06:00 IST|Sakshi

భోపాల్‌: వారసత్వ రాజకీయాలు విషంతో సమానమని హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. వీటివల్ల ఒకే కుటుంబం చెప్పుచేతల్లో పార్టీ, ప్రభుత్వం ఉంటాయన్నారు.

కాంగ్రెస్, డీఎంకే, శివసేన(ఉద్ధవ్‌)వర్గం కుటుంబ రాజకీయాలను నడిపిస్తున్నాయని ఆరోపించారు.  కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ కుల ఉద్యమాలను ప్రోత్సహిస్తోందన్నారు. వీటివల్లే 2018లో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని చెప్పారు.

మరిన్ని వార్తలు