రోజుకు వెయ్యిమందిని పట్టుకోండి 

4 Mar, 2021 03:00 IST|Sakshi

పోలీసులకు ముంబై కమిషనర్‌ టార్గెట్‌

ముంబై ‌: ముంబైలోని ప్రతి జోన్‌లో మాస్కు లేకుండా తిరుగుతున్న వారిలో రోజుకు కనీసం వెయ్యి మందిని పట్టుకుని జరిమానా వసూలు చేయడం లక్ష్యంగా చేసుకోవాలని ముంబై పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ ఆదేశించారు. మాస్క్‌లు ధరించని వారి నుండి పోలీసులు రూ.200 వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ముంబై పోలీస్‌ కమీషనర్‌ పరంబీర్‌ సింగ్‌ పోలీసులకు టార్గెట్‌ విధించారు.

ముంబై నగరంలో మొత్తం 12 జోన్లు ఉన్నాయి. మాస్క్‌ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలనీ, జరిమానా విధించడం ప్రధాన లక్ష్యం కాదనీ, జనాల్లో అవగాహన పెంచేందుకే ఇలాంటి తప్పనిసరి చర్యలు తీసుకోవాల్సి వస్తోందని అయన అన్నారు. కరోనా కట్టడికి ముంబై పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారనీ, కోవిడ్‌ – 19 ను వ్యాప్తి చెందకుండా పోలీసులు జన జాగరణ చేస్తున్నారనీ, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ముంబై పోలీసు విభాగానికి చెందిన అధికార ప్రతినిధి ఎస్‌.చైతన్య అన్నారు.

చదవండి: (మరోసారి కరోనా విజృంభణ.. 14 వరకు కర్ఫ్యూ)

(ప్లాట్‌ఫారం టికెట్‌ రూ.50.. రద్దీని తగ్గించేందుకే)

మరిన్ని వార్తలు